రెబెల్స్ విషయంలో ఎలా?

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారికి ఎన్నికల వ్యూహాలను వివరించనున్నారు. దిశానిర్దేశం చేయనున్నారు. దాదాపు 120 [more]

Update: 2020-01-09 05:35 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారికి ఎన్నికల వ్యూహాలను వివరించనున్నారు. దిశానిర్దేశం చేయనున్నారు. దాదాపు 120 మున్సిపాలిటీలు, పది కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకున్నారు. ఎమ్మెల్యేలకు లక్ష్యాలను వివరించననున్నారు. రెబెల్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించనున్నారు. దాదాపు రెండు గంటల పాటు కేసీఆర్ వీరితో సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేలకు ఎ, బీ ఫారాలు ఈరోజు కేసీఆర్ అందజేయనున్నారు. ఒక్క స్థానంలో ఓడిపోయినా మంత్రి పదవి పోతుందని ఇప్పటికే కేసీఆర్ మంత్రులను హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News