ఈవీఎంలను వ్యతిరేకించాలి

ఈవీఎంల వినియోగాన్ని పార్లమెంటు వేదికగా వ్యతిరేకించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. శనివారం అమరావతిలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ [more]

Update: 2019-01-26 08:46 GMT

ఈవీఎంల వినియోగాన్ని పార్లమెంటు వేదికగా వ్యతిరేకించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. శనివారం అమరావతిలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈవీఎంల వినియోగాన్ని వ్యతిరేకించాలని, వీవీప్యాట్ రశీదులు లెక్కించాలని లేదా బ్యాలట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇందుకోసం అన్ని పార్టీలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధి చెందిన దేశాలే ఈవీఎంలను వాడటం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎంపీలకు ఆయన సూచించారు. ప్రత్యర్థులపై కేంద్రం సీబీఐ, ఈడీ దాడులు చేయించి భయపెడుతోందన్నారు. హర్యానా, యూపీ మాజీ ముఖ్యమంత్రులపై సీబీఐ, ఈడీ దాడులు అందులో భాగమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News