మూకుమ్మడి దాడి మొదలుపెట్టిన టీడీపీ

Update: 2018-08-11 08:58 GMT

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ విషయంలో టీడీపీ ఎంత అప్రమత్తంగా ఉంటుందో తెలిసిందే. జగన్ విషయంలో ఎక్కడ చిన్న అవకాశం వచ్చిన ఆ పార్టీ వదిలిపెట్టదు. మంత్రులు, సీనియర్ నేతలతో ముకుమ్మడి మాటలదాడిని మొదలుపెడుతుంది. తాజాగా, పవన్ కళ్యాణ పై, కాపు రిజర్వేషన్లపై వ్యాఖ్యలు చేసి జగన్ ఇచ్చిన అవకాశాన్ని టీడీపీ శాయశక్తులా ఉపయోగించుకుని కాపుల్లో జగన్ పై వ్యతిరేకత తెచ్చేందుకు ప్రయత్నించింది. టీడీపీలో ఆ సామాజికవర్గం నేతలంతా వరుస పెట్టి జగన్ పై విమర్శల తూటాలు పేల్చారు. సహజంగా వీరి వ్యాఖ్యలకు మీడియాబాగా చూపిస్తోంది.

లైన్ కట్టిన మంత్రులు...

ఇక, తాజాగా జగన్ సతీమణి భారతిపై ఈడీ ఛార్జ్ షీట్ విషయంలోనూ టీడీపీకి జగన్ పై విమర్శలు చేయడానికి మరో అవకాశం లభించినట్లయింది. ఈ విషయంపై జగన్ రాసిన లేఖతో టీడీపీ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ఆ పార్టీ వెంటనే అప్రమత్తమైంది. జగన్ పై రివర్స్ అటాక్ కు దిగింది. మొదట ఆర్థిక మంత్రి యనమల జగన్, తర్వాత నక్కా ఆనంద్ బాబు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు వంటివారు విమర్శలు మొదలు పెట్టారు. జగన్ ది అవినీతి అని, ధనదాహమని, సానుభూతి పొందే ప్రయత్నమని, లాలూచీ అని, కుమ్మక్కు రాజకీయమని, స్వార్థమని, జగన్ మైలేజ్ తగ్గిందని ఇలా రకరకాలుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.

Similar News