రాజకీయాల్లో ట్రెండ్ మార్చిన టీడీపీ

Update: 2018-07-05 18:29 GMT

ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం రాజకీయాల్లో సర్వ సాధారణం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఒక పార్టీ మరో పార్టీపై భౌతిక దాడులకు పాల్పడటం న్యూ ట్రెండ్. ఈ ట్రెండ్ లో టిడిపి అందరికన్నా ముందే వుంది. బిజెపితో కటీఫ్ చెప్పాక జనంలో ఆ పార్టీతో తాము బద్ధ విరోధిగా ఉన్నామనే సంకేతాలు ఇవ్వడానికో, మరొకటో ఏమో కానీ కమలం నేతలపై దాడులు మొదలైపోయాయి. ఇది అనుకుని టీడీపీ చేసినవి కాకపోయినా కాషాయ దళం పూర్తిగా ఈ దాడులను తమకు అనుకూలంగా చక్కగా మలుచుకుంటుంది.

మా ఇద్దరినీ హత్య చేయించాలని చూస్తున్నారు...

తనపైనా , అమిత్ షా పైనా టీడీపీ హత్యా రాకీయాలు చేసేందుకు ప్రయత్నం చేస్తుందంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయి పై తిరుపతిలో ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశారన్నారు కన్నా. తమ పార్టీ నేతలైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇంటిపైనా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పైనా, తనపైనా వరుసగా జరుగుతున్న దాడులు గమనిస్తే టీడీపీ హత్యా రాజకీయాలు పోషిస్తుందని విమర్శించారు. చంద్రబాబుకి హత్యా రాజకీయాలు కొత్తేమీ కాదని అన్నారాయన. బాబు అవినీతిని ప్రశ్నిస్తే అంతమొందించాలని చూస్తూ భౌతిక దాడులకు నిస్సిగ్గుగా పాల్పడుతున్నారంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు. పనిలో పని రాష్ట్ర పోలీస్ శాఖ పనితీరుపైనా విమర్శలు గుప్పించారు. నెల్లూరు జిల్లా కావలిలో ఒక వ్యక్తి చెప్పుతో కన్నా లక్ష్మీనారాయణపై దాడి చేసిన నేపథ్యంలో టిడిపి వెర్సెస్ బిజెపి రాజకీయాలు తీవ్ర స్థాయిలో హత్యా ఆరోపణల వరకూ వెళ్ళాయి.

Similar News