ఢిల్లీ చేరిన డేటా పంచాయితీ

ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ వ్యవహారం ఢిల్లీ చేరింది. తమ కార్యకర్తల డేటా తొలగించారని, ఫారం-7 ద్వారా తమ పార్టీ ఓట్లను వైసీపీ తొలగిస్తోందని, జగన్ పిలుపు [more]

Update: 2019-03-11 12:39 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ వ్యవహారం ఢిల్లీ చేరింది. తమ కార్యకర్తల డేటా తొలగించారని, ఫారం-7 ద్వారా తమ పార్టీ ఓట్లను వైసీపీ తొలగిస్తోందని, జగన్ పిలుపు మేరకే ఇది జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో పాటు సాక్షి పత్రిక, సాక్షి టీవీ జగన్ కు చెందిన సంస్థలు అయినందున వాటిల్లో వచ్చే వార్తలను పెయిడ్ న్యూస్ కింద పరిగణించాలని టీడీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక, మరోకాసేపట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బృందం కూడా ఎన్నికల సంఘాన్ని కలవనుంది. ప్రజల డేటాను ప్రభుత్వం నుంచి చోరీ చేసి టీడీపీ వాడుకుంటోందని, ఓట్ల తొలగింపు, దొంగ ఓట్లపై వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు.

Tags:    

Similar News