సుమలత గెలుపు ఖాయమైనట్లేనా…??

ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని అన్ని జాతీయమీడియా సంస్థలు ముక్కకంఠంతో చెప్పేశాయి. బీజేపీకి పదిహేడు నుంచి [more]

Update: 2019-05-20 10:59 GMT

ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని అన్ని జాతీయమీడియా సంస్థలు ముక్కకంఠంతో చెప్పేశాయి. బీజేపీకి పదిహేడు నుంచి 23 స్థానాల వరకూ వచ్చే అవకాశముందని తేల్చాయి. జాతీయ మీడియా సంస్థలతో పాటు కన్నడనాట కొన్ని సంస్థలు కూడా తమ సర్వేలను వెల్లడించాయి. అన్ని సర్వేల్లోనూ కన్నడనాట ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధిస్తాయని చెప్పాయి. దీంతో మాండ్య నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సర్వేల్లో చెప్పిన స్వతంత్ర అభ్యర్థి మాండ్యలో పోటీ చేసిన సుమలత అని సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాండ్యలో సుమలతకు ప్రత్యర్థిగా జేడీఎస్ నుంచి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ సుమలతకు బీజేపీ నేరుగా మద్దతు ఇవ్వగా, కాంగ్రెస్ నేతలు ఎక్కువ మంది పరోక్షంగా సహకరించారు. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ లో సుమలత విజయం ఖాయమైనట్లే తేలింది. మరి ఈ నెల 23న ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News