కేసీఆర్ కు షాక్ ఇచ్చిన స్టాలిన్

డీఎంకే చీఫ్ స్టాలిన్ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. కేసీఆర్ తో భేటీ గురించి ఆయ‌న మాట్లాడుతూ.. దేశంలో థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు అవ‌కాశం [more]

Update: 2019-05-14 11:08 GMT

డీఎంకే చీఫ్ స్టాలిన్ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. కేసీఆర్ తో భేటీ గురించి ఆయ‌న మాట్లాడుతూ.. దేశంలో థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు అవ‌కాశం లేద‌ని అన్నారు. కేసీఆర్ తో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుపై చ‌ర్చ‌లు జ‌ర‌గ‌ప‌లేద‌ని పేర్కొన్నారు. ఆల‌యాల సంద‌ర్శ‌న‌కు త‌మిళ‌నాడుకు వ‌చ్చిన కేసీఆర్ త‌న‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగానే క‌లిశార‌ని స్ప‌ష్టం చేశారు. ఇక‌, త‌మిళ‌నాడులో కేసీఆర్ – స్టాలిన్ భేటీపై విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. స్టాలిన్ బీజేపీతో ట‌చ్ లో ఉన్నార‌ని, ఇందుకోస‌మే కేసీఆర్ మ‌ద్య‌వ‌ర్తిత్వంతో బీజేపీతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని త‌మిళ‌నాడు మంత్రి జ‌య‌కుమార్ పేర్కొన్నారు. ఇక, స్టాలిన్ బీజేపీతో ట‌చ్ లో ఉన్నార‌ని బీజేపీ తమిళ‌నాడు చీఫ్ సౌందర్య‌రాజ‌న్ కూడా పేర్కొన్నారు. అయితే, ఇవ‌న్నీ కేవ‌లం త‌ప్పుడు ప్ర‌చారాలే అని డీఎంకే నేత‌లు కొట్టి పారేస్తున్నారు.

Tags:    

Similar News