హైదరాబాద్ లోనూ సృష్టి దందా.. పది లక్షలు తీసుకుని
సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ మోసాలు హైదరాబాద్ లో కూడా వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాదులోని గోపాలపురం పరిధిలో లో సృష్టి కార్యాలయం ఉంది. దీనిపైన గతంలో కూడా పలు [more]
సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ మోసాలు హైదరాబాద్ లో కూడా వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాదులోని గోపాలపురం పరిధిలో లో సృష్టి కార్యాలయం ఉంది. దీనిపైన గతంలో కూడా పలు [more]
సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ మోసాలు హైదరాబాద్ లో కూడా వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాదులోని గోపాలపురం పరిధిలో లో సృష్టి కార్యాలయం ఉంది. దీనిపైన గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చాయి. చాలామంది కూడా ఫిర్యాదు చేశారు . అయితే తాజాగా వైజాగ్ లో సృష్టి కేంద్రం అక్రమాలు వెలుగు చూడడంతో మరొకసారి హైదరాబాదులో కూడా దీని అక్రమాలు బయట పడ్డాయి. .. అద్దె గర్భం (సరోగసీ) విధానంలో సంతానం అందజేస్తామని మోసం చేశారంటూ జూబ్లీహిల్స్ కి చెందిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌కు చెందిన దంపతులకు పిల్లలు లేరు. సరోగసీ ద్వారా సంతానం పొందాలని భావించి గత ఏడాది నవంబర్ 11న సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌ను కాంటాక్ట్ చేశారు. ఆసుపత్రి ఎండీ డాక్టర్ నమ్రత సరోగసీ విధానంలో శిశువును అందజేస్తామని నమ్మించారు.ఇందుకు గాను 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని తెలిపారు. అవి ఇచ్చేందుకు దంపతులు ఒప్పుకున్నారు ఈ నేపథ్యంలోనే గత ఏడాది పది లక్షల రూపాయలను ఆసుపత్రికి చెల్లించారు. రూ.10 లక్షలు తీసుకొని తమకు పిల్లలు సరోగసీ విధానం ద్వారా పిల్లలను ఇవ్వలేదని దంపతులు ఆరోపిస్తున్నారు. సరోగసీ మహిళ విశాఖపట్టణంలో ఉందని, చికిత్స పొందుతున్నట్లు చెప్పారని దంపతులు తెలిపారు..ఈ ఏడాది అక్టోబరులో శిశువును ఇవ్వాల్సి ఉంది… అయితే విశాఖపట్నంలోని ఇదే ఆసుపత్రి శిశు విక్రయాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి రావడంతో తమను మోసం చేస్తున్నట్లు గ్రహించిన ఆ దంపతులు పోలీస్ కి ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.