శ్రీ లీక్స్ టాలివుడ్ ను షేక్ చేస్తాయా?

Update: 2018-04-11 07:21 GMT

శ్రీరెడ్డి ఇప్పుడు ఈ పేరుకు పరిచయం అక్కరలేదు ఎక్కడ ఇద్దరు మాట్లాడుకున్నా ... ఈ శ్రీరెడ్డి పై చర్చ రచ్చ రచ్చగా మారిపోయింది ... కాస్టింగ్ కౌచ్ పై నా పోరాటం అని మొదలు పెట్టింది ... త్వరలో శ్రీ లీక్స్ ఇస్తాను అంటూ సంచలనాలకు నాంది పలికింది ..అసలు ఈ శ్రీరెడ్డి ఎవరు? ఆమె అలా ఎందుకు చేస్తోంది.సుచిలీక్స్ తరహాలో టాలీవుడ్ నటి శ్రీరెడ్డి కూడా పరిశ్రమలో తనతో క్లోజ్‌గా ఉన్నవారి ఫోటోలను లీక్ చేయడం ప్రారంభించింది. ఈ మేరకు తనతో సాన్నిహిత్యంగా ఉన్న ఓ వ్యక్తి ఫోటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. అయితే ఆ వ్యక్తి ఫోటోను పూర్తిగా కనిపించకుండా పెట్టడంతో శ్రీరెడ్డి కావాలనే పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంందన్నారు అప్పుడే యుట్యుబ్ హర్ష ,ఇండియన్ ఐడియల్ పేర్లు బైటపెట్టి సంచలనాని నాంది పలికింది .. క్యాస్టింగ్ కౌచ్ లో శేఖ‌ర్ క‌మ్ముల‌ను ఇరికించిన కుడా ఇరికించింది ..ఇలా సాగుతున్న క్రమం లో మా ఆసోశియేషన్ బెంబర్ కార్ట్ ఇవ్వకపోతే మా ఆసోషియేషన్ ముందు బట్టలు ఇప్పుతాను అని చివరకు అన్నంత పని చేసింది శ్రీ రెడ్డి.

మీడియాను మేనేజ్ చేస్తున్నారంటూ....

ప్రముఖ ద‌ర్శకుడు శేఖ‌ర్ క‌మ్ముల‌ను ప‌రోక్షంగా క్యాస్టింగ్ కౌచ్ జాబితాలో చేర్చేసింది న‌టి శ్రీ‌రెడ్డి.. ఇటీవ‌ల కాలంలో టాలీవుడ్‌లో ‘క్యాస్టింగ్ కౌచ్’ విపరీతంగా పెరిగిపోయిందని, అందుకే తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం లేదంటూ టాలీవుడ్ ప్రముఖుల‌ను షేక్ చేస్తున్న శ్రీ‌రెడ్డి ద‌ర్శకుడు శేఖర్ కమ్ముల పేరును శ్రీరెడ్డి పరోక్షంగా ప్రస్తావించింది. ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ ఉంచింది..పెద్ద డైరెక్టర్ అని పోజు. అబద్ధాలు చెప్పడంలో దిట్ట. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికిరారని ప్రగాఢ విశ్వాసం. ప్రామిస్ లను బ్రేక్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. బక్కపీచు సోగ్గాడు. ఊదితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండూ ఎక్కువే. టెక్నికల్ గా దొరక్కుండా టెక్నాలజీని బాగా వాడాడు. మా ఇంటి కింద గూర్ఖాలా తిరిగేవాడు. వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకుంటాడు పాపం. మగ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుతాడని టాక్. వీరెవరో కాదు కొమ్ములు వచ్చిన శేఖర్” అంటూ శేఖర్ కమ్ములపై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాను చేస్తున్న పోరాటాన్ని అణిచివేసేందుకు కొందరు పెద్ద మనుషులు మీడియాను మేనేజ్ చేస్తున్నారని ఆరోపిస్తుంది శ్రీరెడ్డి. కానీ తన పోరాటాన్ని ఎవ్వరూ ఆపలేరంటూ శ్రీరెడ్డి తేల్చి చెప్పింది.కొందరు పెద్ద మనుషులు ఆడుతున్న పొలిటికల్ గేమ్ వల్ల ఎందరో గొప్ప యాక్టర్లు చనిపోయారని, తన జీవితం గురించి భయం లేదని, ఎవరి బెదిరింపులను లెక్క చేయనని శ్రీరెడ్డి చెబుతున్నారు.

తెలుగు సీఎంలు స్పందించాలంటూ....

తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు స్పందించాల్సిన అవసరం వుందని తాజాగా తన ఫేస్ బుక్ పొస్ట్ పెట్టారు శ్రీరెడ్డి చివరకు యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయిన వైవా హర్ష గురించి శ్రీరెడ్డి ఓ పోస్టు పెట్టారు. షార్ట్ ఫిలింస్‌లో విషయంలో హెల్ప్ అడిగినందుకు అతడు ఎలా ప్రవర్తించాడో వెల్లడిస్తూ.... వాట్సాప్ చాటింగ్ విషయాలను ఆమె విడుదల చేశారు. ఏదైనా చేసుకుని బతకొచ్చుకదా అన్న వారికి ఇది నా సమాధానం. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, చివరకు షార్ట్ ఫిల్మ్స్ అన్ని చోట్లా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని..... శ్రీరెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు.త నకు రోజూ వందల కాల్స్, మెసేజ్ లు బెదిరించే విధంగా వస్తున్నాయని శ్రీరెడ్డి తెలిపింది. అయినా కూడా తాను ఎవరికీ భయపడనని తెగేసి చెప్పింది. కనీసం నా ఫోన్ నంబర్ కూడా మార్చనని, శ్రీరెడ్డి ఇంటర్వ్యూ లో వెల్లడించింది. తన పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకుని వెళతానని స్పష్టం చేసింది.రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు స్పందించాల్సిన అవసరం వుందని తాజాగా తన ఫేస్ బుక్ పోస్ట్ లో తెలిపారు

Similar News