బ్రేకింగ్ : తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. రెండు వేలకు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. తాజాగా 2,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒక్కరోజులు 14 మంది మరణించారు. దీంతో తెలంగాణలో [more]

Update: 2020-08-08 04:04 GMT

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. తాజాగా 2,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒక్కరోజులు 14 మంది మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77,513కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణలో మరణించిన వారి సంఖ్య 615కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 54,330గా ఉంది. ప్రస్తుతం తెలంగాణ లో యాక్టివ్ కేసులు 23,183గా ఉంది. కొత్తగా నమోదయిన కేసుల్లో హైదరాబాద్ పరిధిలో 464 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసంది.

Tags:    

Similar News