బ్రేకింగ్: కాంగ్రెస్ కి షాక్ ఇచ్చిన ఎస్పీ-బీఎస్పీ

మహాకూటమి ఏర్పాటుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోనే ఎక్కువ పార్లమెంటు స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ లేకుండానే కూటమి ఏర్పడింది. రాష్ట్రంలో బలమైన పార్టీలుగా ఉన్న సమాజ్ [more]

Update: 2019-01-12 07:12 GMT

మహాకూటమి ఏర్పాటుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోనే ఎక్కువ పార్లమెంటు స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ లేకుండానే కూటమి ఏర్పడింది. రాష్ట్రంలో బలమైన పార్టీలుగా ఉన్న సమాజ్ వాది పార్టీ, బహిజన సమాజ్ వాది పార్టీ పొత్తు ఖరారైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో ఉంటాయనుకున్న ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ లేకుండానే పొత్తు ఖరారు చేసుకున్నాయి. ఈ మేరకు ఇవాళ మాయావతి, అఖిలేష్ యాదవ్ కలిసి ఉమ్మడిగా ప్రకటన చేశారు. రెండు పార్టీలు 38 స్థానాల చొప్పున పోటీ చేయనున్నాయి. రెండు స్థానాలను ఆర్ఎల్డీకి కేటాయించనున్నారు.

వారికి ఇక నిద్ర పట్టదు

కూటమిలో కాంగ్రెస్ ఉన్నా, లేకున్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పనియోజకవర్గాలు అమెథి, రాయబరేలిలో వీరు పోటీ పెట్టవద్దని నిర్ణయించారు. అయితే, కాంగ్రెస్ కి యూపీలో బలం లేదని, పొత్తుపై ఆ పార్టీతో చర్చించలేదని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, అందుకోసమే ఎస్సీ-బీఎస్పీ కూటమి పనిచేస్తుందని, అమిత్ షా, మోదీకి ఇక నిద్ర పట్టదని మాయావతి పేర్కొన్నారు. దేశం కోసమే ఎస్పీ – బీఎస్పీ పనిచేస్తాయని సపేర్కొన్నారు.

Tags:    

Similar News