చౌహాన్ చుక్కలు చూపిస్తున్నారు....!!!

Update: 2018-12-11 07:04 GMT

మధ్యప్రదేశ్ లో విజయం కాంగ్రెస్, బీజేపీ ల మధ్య దోబూచులాడుతోంది. మూడు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో సులువుగా గట్టెక్కుతామనుకున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి రౌండ్ లోనూ బీజేపీ షాకిస్తూనే ఉంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. దిగ్విజయ్ సింగ్, కమల్ నాధ్, జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతలు ఈ ఎన్నికల్లో విజయం కోసం శ్రమించారు. అయితే బీజేపీ తరుపున శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక్కరే ఒంటిచేత్తో ప్రచారం నిర్వహించారు.

నెక్ టు నెక్....

ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా వంటి వారు ప్రచారం చేసినా శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం అంతా తానే అయి వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం మొత్తాన్ని తానే నిర్వహించారు. రైతులపై కాల్పులు, వివిధ వర్గాల అసంతృప్తిని తట్టుకుని శివరాజ్ సింగ్ చౌహాన్ పార్టీని విజయం వైపు నడిపిస్తున్నట్లే కన్పిస్తోంది. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కాంగ్రెస్ 110, బీజేపీ 107,ఇతరులు 13 స్థానాల్లో గెలుపొందారు. చివరి నిమిషంలో బీజేపీ పుంజుకునే అవకాశాలున్నాయి. ఏమోమళ్లీ సీఎం చౌహాన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.

Similar News