మెగా మానియా

బాహుబలి వచ్చింది మొదలు భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రేక్షకుల్లో క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సినిమాలంటే బాగా మోజు మీద ఉండే గోదావరి జిల్లాల్లో ఇది [more]

Update: 2019-10-02 02:23 GMT

బాహుబలి వచ్చింది మొదలు భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రేక్షకుల్లో క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సినిమాలంటే బాగా మోజు మీద ఉండే గోదావరి జిల్లాల్లో ఇది మరీ ఎక్కువ. అందులోను మెగా ఫ్యామిలీ చిత్రాలను తొలి రోజే చూసే కసి ఇక్కడి ఫ్యాన్స్ ప్రత్యేకత. దాంతో ఇప్పుడు అన్ని థియేటర్లు సైరా అని గర్జిస్తున్నాయి. ఎక్కడ చూసినా చిరంజీవి తొలిసారి చారిత్రక నేపధ్యం వున్న చిత్రంలో నటిస్తూ ఉండటంతో మెగాస్టార్ ను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఉరకలేస్తున్నారు అభిమానులు.

భారీ కటౌట్ లు పాలాభిషేకాలు …

సైరా చిత్రం కోసం గోదావరి జిల్లాల థియేటర్లు ప్రత్యేక అలంకరణలతో సిద్ధం అయిపోయాయి. మెగాస్టార్ వీరాభిమానులు తమ హీరో కటౌట్ లు ఫ్లెక్సీలతో హంగామా గట్టిగానే చేస్తున్నారు. ఎక్కడ చూసినా సైరా సందడి అంబరాన్ని తాకుతుంది. కటౌట్ లకు పూలదండలు పాలాభిషేకాలు మొదలు పెట్టి తమ అభిమానాన్ని కురిపించేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కొన్ని చోట్ల తమ హీరో చిత్రం హిట్ కావాలని గుళ్ళు గోపురాలు చుట్టూ రౌండ్స్ కొడుతున్నారు. ఇక కొబ్బరి కాయల మొక్కులకు కొదవే లేదు. దసరా ఉత్సవాల్లో సైతం అమ్మవారికి సైరా హిట్ కావాలంటూ పూజలు చేసేస్తున్నారు. మెగా మానియా తో గోదావరిలా ఉప్పొంగిన అభిమానం పైనే ఇప్పుడు గట్టి టాక్ నడుస్తుంది. మరి చిరంజీవి తాజా చిత్రం ఫ్యాన్స్ అంచనాలు ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News