అవిశ్వాసంలో ఏయే పార్టీల‌కు ఎంత స‌మ‌యం..?

Update: 2018-07-19 13:43 GMT

అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా పార్టీలు మాట్లాడాల్సిన స‌మ‌యాన్ని స్పీక‌ర్ కేటాయించారు. ఎంపీల సంఖ్య ఆధారంగా పార్టీల‌కు స‌మ‌యాన్ని నిర్ణ‌యించారు. లోక్ స‌భ‌లో ఎక్కువ స‌భ్యులు ఉన్న బీజేపీకి 3.33 గంట‌లు, కాంగ్రెస్ కు 38 నిమిషాలు, అన్నా డీఎంకేకి 29 నిమిషాలు, తృణ‌మూల్ కాంగ్రెస్‌కు 27 నిమిషాలు, బీజేడీకి 15 నిమిషాలు, శివ‌సేన 14, తెలుగుదేశం పార్టీకి 13 నిమిషాలు, టీఆర్ఎస్‌కి 9 నిమిషాలు, సీపీఐ 7 నిమిషాలు, స‌మాజ్‌వాదీ పార్టీకి 6 నిమిషాలు కేటాయించారు.

ఉన్న స‌మ‌యంలోనే అన్ని విష‌యాలు...

రేపు ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు అవిశ్వాసంపై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యం కూడా ర‌ద్దు చేశారు. అయితే, అధికారికంగా తెలుగుదేశం పార్టీకి 13 నిమిషాలు కేటాయించ‌డంతో ఆ స‌మ‌యాన్ని స‌మ‌ర్థంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. మ‌రికొంత అద‌న‌పు స‌మ‌యం కూడా అడ‌గాల‌ని భావిస్తోంది ఆ పార్టీ. ఇక ప్ర‌త్యేక హోదాకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ‌స్య‌ల‌పై కొంత సేపు మాట్లాడే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది.

Similar News