ఆర్థిక రంగం బలోపేతానికి రంగంలోకి ఆర్బీఐ

1930వ తర్వాత ఆర్థిక సంక్షోభాన్ని ఇప్పుడు చూస్తున్నామని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తి కాంత దాస్ తెలిపారు. ఆటో మొబైల్ రంగం తీవ్ర సంక్షోభాన్ని చూస్తుందన్నారు. 2021-22లో [more]

Update: 2020-04-17 05:06 GMT

1930వ తర్వాత ఆర్థిక సంక్షోభాన్ని ఇప్పుడు చూస్తున్నామని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తి కాంత దాస్ తెలిపారు. ఆటో మొబైల్ రంగం తీవ్ర సంక్షోభాన్ని చూస్తుందన్నారు. 2021-22లో వృద్ధిరేటు 7.4 శాతంగా ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. ఉత్పత్తి సూచి నాలుగు నెలల కనిష్ట కాలానికి పడిపోయిందన్నారు. దేశంలో 90 శాతం మంది ఏటీఎంనలను ఉపయోగిస్తున్నారన్నారు. కరోనా సమయంలోనూ తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాలు చురుగ్గా పనిచేస్తున్నాయని చెప్పారు. సంక్షోభ సమయంలోనూ బ్యాంకుల సేవలు ప్రశంసనీయమన్నారు.

యాభై వేల కోట్ల నిధులను…..

ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్యాంకులకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తయారీ రంగం నాలుగు నెలల కనిష్టానికి పడిపోయిందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శక్తికాంత్ దాస్ అభిప్రాయపడ్డారు. మార్కెట్ల పై ఆర్థిక భారం పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇబ్బందులు లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. కష్టాల్లో కూడా 1.9శాతం వృద్ధిరేటు సాధిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏటీఎంలలో ఎప్పటికప్పుడు నగదును నింపుతున్నామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు యాభే వేల కోట్ల నిధులను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు యాభై వేల కోట్లు సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్బీఐ వద్ద విదేశీ మారక నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. లాక్ డౌన్ తర్వాత 1.2 లక్షల కోట్లు విడుదల చేస్తామని చెప్పారు.

Tags:    

Similar News