అడ్డుకుంటున్నారే

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద క్యూ కట్టారు. తాము విధుల్లో చేరేందుకు వచ్చామని అధికారులను కోరుతున్నా వారు ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము విధుల్లోకి తీసుకోబోమని [more]

Update: 2019-11-26 02:35 GMT

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద క్యూ కట్టారు. తాము విధుల్లో చేరేందుకు వచ్చామని అధికారులను కోరుతున్నా వారు ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము విధుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేస్తున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ఉద్రిక్తత నెలకొంది. కార్మికులు తమను విధుల్లో చేర్చుకోనందుకు నిరసనగా ఆందోళనకు దిగడంతో ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తున్నారు. తాము సమ్మె విరమించామని, విధుల్లో చేరతామని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా కార్మికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందో? నన్న భయం వారిని పట్టుకుంది.

Tags:    

Similar News