రేణుకాచౌదరి ఇలా చేశారా..?

Update: 2018-08-03 11:26 GMT

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరిపై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం కొందరు గాంధీ భవన్ ముందు ధర్నాకు దిగారు. గత ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ ఇప్పిస్తాని రేణుక చౌదరి తమవద్ద రూ.కోటి 30 లక్షలు తీసుకున్నారని ఆరోపిస్తూ కళావతి అనే మహిళ, పలువురు కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. తన భర్త డా. రాంజీ నాయక్ కు టిక్కెట్ ఇప్పిస్తామని రేణుక డబ్బు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు.

డబ్బు అడిగితే....

తమ డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే, మాపైనే కేసులు పెట్టించిందని వారు ఆరోపిస్తున్నారు. తమ డబ్బు తమకు ఇప్పించి న్యాయం చేయాలని లేకపోతే తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీని కలుస్తామని తెలిపారు. ఒకవేళ ఆయనను కలవనీయకపోతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. దీంతో గాంధీ భవన్ వద్ద ఉన్న నేతలు కంగుతిన్నారు. వారిని పిలిపించి మాట్లాడదామనుకున్నారేణుకకు కోపం వస్తుందని బెదిరి మిన్నకుండిపోయారు కొందరు నేతలు.

Similar News