అనుకున్నట్లే చేసిన ఆర్బీఐ ...

Update: 2018-06-06 22:30 GMT

దేశంలో వృద్ధి రేటు పడిపోకుండా అంతర్జాతీయ పరిణామాలకు స్టాక్ మార్కెట్ కుప్పకూలకుండా రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం ప్రకటించింది. అందరూ భావించినట్లే రేపో రేట్లు సవరించింది. బ్యాంక్ లకు రిజర్వ్ బ్యాంక్ నడుమ వుండే వడ్డీ రేట్లనే రేపో అంటారు. గత నాలుగేళ్ళుగా రేపో ను ముట్టుకోలేదు రిజర్వ్ బ్యాంక్. కానీ ఇప్పుడు 0. 25 పెంచక తప్పని పరిస్థితి ఎదురైంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో రూపాయి క్షిణించాయి. స్టాక్ మార్కెట్ తీవ్రంగా ఒడిదుడుకులకు లోనౌతుంది. ఈ నేపథ్యంలో రేపో వడ్డీ రేట్లు సరిచేయక తప్పని పరిస్థితి ఎదురైంది. ఇప్పటివరకు ఆరుశాతం రేపోగా ఉండగా ఇకపై 6.25 వసూలు చేయనున్నారు.

ఇక గృహ రుణాలకు బ్యాండ్ తప్పదు ...

రేపో రేటు సవరణ స్టాక్ మార్కెట్ పై సానుకూలంగానే వుంది. ముందుగానే రేపో పెరగనుంది అన్న సమాచారంతో మార్కెట్లలో ఉదయం నుంచి హుషారుగానే నడిచాయి. రేపో రేటు సవరణతో గృహ రుణాలు, వాహన రుణాల వడ్డీ రేట్లు భారీగా పెరగనున్నాయి. దాంతో సామాన్య మధ్యతరగతి వర్గాలకు వాతలు తప్పడం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఊర్జిత్ పటేల్ గత రెండు రోజులుగా రేపో రేటు పెంపుపై తీవ్ర స్థాయిలో ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. అనంతరం తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. రేపో పెరుగుదల ఎఫెక్ట్ బ్యాంక్ రుణాలు తీసుకునే వారిపై పడనున్న నేపథ్యంలో ఎన్నికల ఏడాది బిజెపి సర్కార్ కు ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే నోట్ల రద్దు తో సామాన్యులు, జీఎస్టీ తో వ్యాపారవర్గాల్లో మెజారిటీ వర్గం కమలంపై వ్యతిరేకత పెంచుకుంటూ వస్తున్నారు. దాంతో రాబోయే రోజుల్లో మోడీ ఎన్నికలముందు రేపో రేటు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Similar News