రేవ్ పార్టీలకు హబ్ గా హైదరాబాద్ ...!!?

Update: 2018-12-23 02:30 GMT

ఐటి హబ్ గా విశ్వవిఖ్యాతం అవుతున్న హైదరాబాద్ ఇప్పుడు రేవ్ పార్టీలకు హబ్ గా అవతరించడం ఆందోళన కలిగిస్తుంది. పబ్ కల్చర్, డ్రగ్స్ విచ్చలవిడితనం, వీటికి తోడు భాగ్యనగరం శివార్లలో రేవ్ పార్టీలు ఇది విశ్వ నగరానికి మాయని మచ్చలు తెచ్చి పెడుతుంది. నిత్యం నిఘా పెట్టినా ఎక్కడా తగ్గడం లేదు జల్సా రాయుళ్ళు. వీరికి శివారు ప్రాంతాలు అడ్డాగా నిలిచి ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఆవారాగా తిరిగే వారే ఇప్పటివరకు జల్సాలు చేసేవారి జాబితాల్లో గతంలో ఉండేవారు. ఇప్పుడు ఆ జాబితాలోకి డాక్టర్లు, ఇంజనీర్లు వివిధ ప్రొఫెషనల్స్ వచ్చి చేరడం మరింత ఆందోళనకరపరిణామం.

బయటపడిన వైద్యుల బాగోతం ...

హైదరాబాద్ శివార్లలో వుండే శామీర్ పేట ప్రాంతంలో అనేక రిసార్ట్ లు కొలువై వున్నాయి. వందల ఎకరాల విస్తీర్ణంలో బడాబాబులు యజమానులుగా వుండే ఈ రిసార్ట్ లలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా బాహ్య ప్రపంచానికి తెలిసే ఛాన్స్ లేనే లేదు. అందుకే గజ్వేల్ కి చెందిన డాక్టర్ లింగం, చంద్రారెడ్డి తమ మిత్ర బృందానికి మంచి పార్టీ ఏర్పాటు చేశారు. అదే రేవ్ పార్టీ. అందమైన అమ్మాయిలను రప్పించి మందు చిందు కి ముక్క జోడించారు.

హెచ్ఐవీ టెస్ట్ కూడా.....

తీసుకువచ్చిన అమ్మాయిలకు హెచ్ ఐ వి ఏమైనా ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి పరీక్షలు చేశారు. అందుకోసం హెచ్ ఐ వి కిట్ సైతం పట్టుకుపోయారు. ఆవిధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న వైద్య బృందం రేవ్ పార్టీ సంగతి శామీర్ పేట పోలీసులకు ఉప్పందంది. ఇంకేముంది రిసార్ట్ పై అటాక్ చేశారు పోలీసులు. దాంతో 11 మంది వైద్యులు 7 గురు యువకులు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఈ పార్టీలో నలుగురు యువతులను రెస్క్యూ చేయగా, మరో నలుగురు మహిళలను నిర్వాహకులుగా గుర్తించి అరెస్ట్ చేశారు ఖాకీలు. రిసార్ట్ లో వున్న కార్లు, సెల్ ఫోన్లు, విదేశీ మద్యం బాటిల్స్ సీజ్ చేశారు.

Similar News