బ్రేకింగ్ : గంటన్నర పాటు రాహుల్...?

Update: 2018-09-18 14:17 GMT

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కొద్దిసేపటి క్రితం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో గంటన్నర సేపు భేటీ అయ్యారు. 2014లో చేసిన తప్పులను మళ్లీ చేయవద్దని ఆయన నేతలకు సూచించారు. పొత్తుల విషయం వెంటనే తేల్చేయాలని, వాటి వల్ల పార్టీకి నష్టం కలిగేలా ఉండొద్దని రాహుల్ దిశానిర్దేశం చేశారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ, మధు యాష్కి, భట్టి విక్రమార్కలతో రాహుల్ విడివిడిగా మాట్లాడారు.

ఛాలెంజ్ గా తీసుకుని......

ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకోవాలని సూచించారు. నేతల్లో ఐక్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణను సిద్ధం చేయమని కోరారు. ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలపై న్యాయపరంగా పోరాడాలని చెప్పారు. ఏ మాత్రం అలక్ష్యం చూపవద్దని కోరారు. తన పర్యటన షెడ్యూల్ ను ఖరారు చేయాలని ఆదేశించారు. అందరూ ఐక్యంగా పనిచేసి అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ నేతలకు గట్టిగానే క్లాస్ పీకారు.

Similar News