తండ్రికి త‌గ్గ త‌న‌యుడు జ‌గ‌న్‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ తండ్రికి త‌గ్గ త‌న‌యుడ‌ని, ఆయ‌న‌కు కూడా వైఎస్ లానే బీసీలపై ప్రేమ ఉంద‌ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు [more]

Update: 2019-02-12 13:27 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ తండ్రికి త‌గ్గ త‌న‌యుడ‌ని, ఆయ‌న‌కు కూడా వైఎస్ లానే బీసీలపై ప్రేమ ఉంద‌ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్.కృష్ణ‌య్య పేర్కొన్నారు. ఏలూరులో ఈ నెల 17న జ‌రుగ‌నున్న‌ వైఎస్సార్సీపీ బీసీ గ‌ర్జ‌న‌కు హాజ‌రుకావాల్సిందిగా వైసీపీ బీసీ నేత‌లు ఇవాళ కృష్ణ‌య్య‌ను ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా కృష్ణ‌య్య మాట్లాడుతూ… బీసీల‌కు వైఎస్ ఎంతో మేలు చేవార‌ని, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, హాస్ట‌ళ్లు ఏర్పాటుచేసి బీసీలు ఉన్న‌త చ‌దువులు చ‌దివేందుకు కృషి చేశార‌న్నారు. ఆయ‌న‌లానే జ‌గ‌న్ కి కూడా బీసీల‌పై ప్రేమ ఉంద‌ని, చ‌ట్ట‌స‌భ‌ల్లో బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల‌ కోసం 36 పార్టీల‌ను కోరితే జ‌గ‌న్ ఒక్క‌రే స్పందించార‌ని, పార్ల‌మెంటులో ప్రైవేటు మెంబ‌ర్ బిల్లు పెట్టి మ‌రీ ఈ అంశాన్ని పార్ల‌మెంటు దృష్టికి తీసుకువచ్చార‌ని పేర్కొన్నారు. వైసీపీ బీసీ గ‌ర్జ‌న‌కు హాజ‌ర‌వుతాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జ‌గ‌న్ కు త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు.

Tags:    

Similar News