జగన్ పై దాడి...డౌట్స్ ఇవే....!!!

Update: 2018-10-26 09:30 GMT

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. హత్యాయత్నం జరిగిన విధానం, ధర్యాప్తు, అనంతర పరిణామాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

01.- సంఘటన జరిగిన రెండు గంటల్లోపే జగన్ తో నిందితుడి ఫ్లెక్సీ ఎలా వచ్చింది ? ఎప్పుడో పది నెలల కింద వేశారని చెబుతున్న ఫ్లెక్సీ ఘటన జరిగిన రెండు గంటల్లోనే ఎలా దొరికింది ? వైఎస్ఆర్ ఫోటో లేకుండా ఈ ఫ్లెక్సీ వేశారా ?

02. - నిందితుడు పదేపదే జగన్ అభిమాని అని మాత్రమే చెబుతున్నారు కానీ, నిందితుడి గురించి ఇతర విషయాలు ఎందుకు బయటపెట్టడం లేదు. నిందితుడికి ఇంతకుముందే నేరచరిత్ర ఉందనే ఆరోపణల గురించి వివరాలు ఎందుకు చెప్పడం లేదు ?

03. - ఘటన జరిగిన 2 గంటల్లోపే, విచారణ కూడా పూర్తి కాకముందే నిందితుడు జగన్ అభిమాని అని, పబ్లిసిటీ కోసమే చేశాడని ఎలా చెప్పారు ?

04. - డీజీపీ మీడియాతో మాట్లాడినప్పుడే, ఘటన జరిగిన రెండు గంటల్లోనే సీఐఎస్ఎఫ్ నిందితుడిని తమకు అప్పగించారని స్వయంగా డీజీపీ చెప్పారు. రాత్రి చంద్రబాబు మాట్లాడుతూ... సాయంత్రం నాలుగు గంటలకు నిందితుడిని తమ పోలీసులకు అప్పగించారని చెప్పారు. అంటే డీజీపీ చెప్పింది నిజమా ? చంద్రబాబు చెప్పింది నిజమా ?

04. - ఘటన జరిగిన గంటలోనే నిందితుడి జేబులో ఉత్తరం ఉంది అని చెబుతూ వచ్చిన మంత్రులు రాత్రి వరకు ఎందుకు బయటపెట్టలేదు ?

05. - కేవలం పదో తరగతి మాత్రమే చదివిన వ్యక్తి 11 పేజీల లేఖ ఎటువంటి తప్పులు లేకుండా రాశాడా ? లేఖలో రాసిన అంశాలను పరిశీలిస్తే నిందితుడికి అంత రాజకీయ, సామాజిక అవగాహన ఉందా ?

06. - లేఖలో రాసిన హ్యాండ్ రైటింగ్ పలు విధాలుగా ఉంది. మొదటి తొమ్మిది పేజీల్లో ఒక హ్యాండ్ రైటింగ్ ఉండగా... తర్వాతి రెండు పేజీల్లో మరో రైటింగ్ ఉంది. ఇక పేరు, సంతకం కూడా వేరే హ్యాండ్ రైటింగ్ తో ఉన్నాయెందుకు ?

06. - నిందితుడి జేబులో 11 పేజీల లేఖ ఉంటే అది మడతపెట్టుకుని జేబులో పెట్టుకుంటాడు. ఘటన సమయంలో జరిగిన గలాటాతో లేఖ నలిగిపోయి ఉండాలి. కానీ, లేఖ లో ఎటువంటి మడతలు కనిపించడం లేదు ఎందుకు ?

07. - నిందితుడు నెల రోజుల క్రితం తన స్వగ్రామంలో తన అన్న కూతురి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా వింధు ఇచ్చారంటున్నారు ? అంత ఘనంగా వింధు ఇచ్చేంత స్తోమత వెయిటర్ గా పనిచేస్తున్న వ్యక్తికి ఉంటుందా ?

08. - నిందితుడు జగన్ అభిమాని అనే పదేపదే చెబుతున్న రెస్టారెంట్ యాజమాని హర్షవర్ధన్ ప్రసాద్ స్వయంగా టీడీపీ నేత. మరి టీడీపీ నేత జగన్ వీరాభిమానిని అంత సులువుగా పనిలో పెట్టుకుంటారా ?

పై ప్రశ్నలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే లేవనెత్తుతున్నారు. మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు వస్తాయో లేదో చూడాలి.

Similar News