రద్దు శాసనసభ పరిధిలోనిదే

రాజ్యాంగం ఆర్టికల్ 169 ప్రకారం శాసనమండలి రద్దు అనేది శాసనసభలో మూడింట రెండు వంతుల మంది ఆమోదించి తీర్మానం చేస్తే పంపితే పార్లమెంటు రద్దు చేయవచ్చు. లేదా? [more]

Update: 2020-01-27 13:18 GMT

రాజ్యాంగం ఆర్టికల్ 169 ప్రకారం శాసనమండలి రద్దు అనేది శాసనసభలో మూడింట రెండు వంతుల మంది ఆమోదించి తీర్మానం చేస్తే పంపితే పార్లమెంటు రద్దు చేయవచ్చు. లేదా? పునరుద్ధరించవచ్చని ప్రొఫెసర్ కె. నాగేశ్వరరావు తెలిపారు. రాజ్యసభ, శాసనమండలి వేర్వేరు అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యసభకు రాజ్యాంగ బద్ధమైన అధికారాలున్నాయని ఆయన చెప్పారు. ఆర్టికల్ 197 ప్రకారం శాసనమండలి ఉండాలా? వద్దా? అన్నది శాసనసభ నిర్ణయం ఫైనల్ అని నాగేశ్వర్ తెలిపారు. రాజ్యాంగంలో రాజ్యసభకు ఉన్న హోదా వేరని, శాసనమండలికి ఉన్న హోదా వేరని ఆయన తెలిపారు. పూర్తిగా శాసనసభ ఇష్టాయిష్టాలపైనే మండలి ఆధారపడి ఉందన్నారు. రాజ్యసభకు ఛైర్మన్ గా ఉప రాష్ట్రపతి ఉంటారన్నారు. రెండు సభలకు పోలిక సరికాదని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారన్నారు.

రద్దు ప్రారంభం మాత్రమే….

అసెంబ్లీ తీర్మానం తర్వాత పార్లమెంటు శాసనమండలి రద్దు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. పార్లమెంటు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చని తెలిపారు. బీజేపీ చేతుల్లోకి శాసనమండలి రద్దు బిల్లు వెళ్లిపోయిందన్నారు. బీజేపీ అంగీకరించకపోతే ఆ బిల్లును కోల్డ్ స్టోరేజీలో పెట్టేయవచ్చన్నారు. లోక్ సభ స్పీకర్ కు మాత్రమే ఈ బిల్లు వెళుతుందన్నారు. శాసనసభ తీర్మానంతో మండలి రద్దు ప్రక్రియ ప్రారంభమయినట్లేనని, రద్దు కాలేదని స్పీకర్ నాగేశ్వర్ తెలిపారు. పార్లమెంటు నిర్ణయం తీసుకునే వరకూ శాసనమండలి కొనసాగుతుందని చెప్పారు. శాసనమండలి రద్దు అయ్యేంత వరకూ సెలెక్ట్ కమిటీ ఉంటుందని ఆయన చెప్పారు. శాసనమండలి సమావేశాలు ఆరు నెలలు వరకూ జరపకపోయినా పరవాలేదని చెప్పారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ నాగేశ్వర్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Tags:    

Similar News