రాహుల్ క‌న్నుకొట్ట‌డంపై ప్రియా వారియ‌ర్ కామెంట్స్‌

Update: 2018-07-20 14:20 GMT

పార్ల‌మెంట్‌లో అవిశ్వాస తీర్మాన సంద‌ర్భంగా జ‌రిగిన చ‌ర్చ‌లో ప్రసంగం మ‌ధ్య కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌ధాని మోదీ వ‌ద్ద‌కు వెళ్లి కౌగ‌లించుకోవ‌డం, అనంత‌రం త‌న సీట్లోకి వ‌చ్చి క‌న్నుకొట్టడం దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. దేశ‌మ్మొత్తం సోష‌ల్ మీడియాలో ఇది హైలెట్ అవుతోంది. అయితే, ఓ పాట‌లో క‌న్నుకొట్టి దేశ‌వ్యాప్తంగా ఎంద‌రో మ‌న‌సుల్ని దోచుకున్న మ‌ళ‌యాళ న‌టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ రాహుల్ క‌న్నుకొట్ట‌డంపై స్పందించింది. కాలేజీ నుంచి రాగానే రాహుల్ పార్ల‌మెంట్ లో క‌న్నుకొట్ట‌డం గురించి త‌న అమ్మ చెప్పింద‌ని, టీవీ పెట్టి చూడ‌గా, రాహుల్ స‌ర్ ను త‌న పోల్చి చూపిస్తున్నార‌ని, ఇది త‌న‌కు చాలా ఆనందంగా ఉంద‌ని వ్యాఖ్యానించారు. అంత‌పెద్ద వ్య‌క్తిని త‌న‌తో పోల్చినందుకు సంతోషంగా ఉంద‌ని ఆమె తెలిపారు.

Similar News