బ్రేకింగ్ : బాబు సంస్థలపై విచారణకు??

Update: 2018-12-13 11:52 GMT

హెరిటేజ్ కంపెనీ వ్యవహారాలపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. హెరిటేజ్ గ్రూప్ కి చెందిన 14 కంపెనీల్లో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిలో ఫోరెన్సీక్ ఆడిట్ చేసి ఆర్వోసీ విచారణ కోసం ఆదేశించాలని కోరుతూ అడ్వకేట్ రామారావు హైకోర్టులో పిటీషన్ వేశారు. ఆయన ఇప్పటికే ఈ మేరకు ఆర్వోసీకి ఫిర్యాదు చేయగా ఐదు కంపెనీలపై కేసులు నమోదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, మిగతా వాటిపై కనీసం కేసు నమోదు చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ పిటీషన్ లో చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణిని ప్రతివాదులుగా చేర్చారు. హెరిటేజ్ గ్రూప్ లో 14 కంపెనీలు చూపిస్తున్నా... వాటిలో చాలా కంపెనీలు పనిచేయకున్నా భారీగా లావాదేవీలు జరుగుతున్నాయని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Similar News