ఉంటే ఉండొచ్చు.. లేకుంటే వెళ్లొచ్చు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో పవన్ కల్యాణ‌్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో ఉండేవాళ్లు ఉండవచ్చని, [more]

Update: 2020-02-01 12:19 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో పవన్ కల్యాణ‌్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో ఉండేవాళ్లు ఉండవచ్చని, ఇష్టం లేని వాళ్లు వెళ్లిపోవచ్చని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు. పార్టీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఉన్నారో? లేదో? తెలియకుండా ఉందని పవన్ కల్యాణ్ నిర్వేదం చెందారు. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారు తనపై బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారని పరోక్షంగా జేడీ లక్ష్మీనారాయణ పై స్పందించారు. బలవంతంగా పార్టీలో ఎవరూ ఉండాల్సిన అవసరం లేదన్నారు. కాపలా కాసే రాజకీయాలు తాను చేయనన్నారు. తనపై ఆధారపడ్డే వారి కోసమే సినిమాలు చేస్తున్నానని చెప్పారు. నెలకు కోటిరూపాయల ఆదాయం, వేల కోట్ల ఆస్తి ఉంటే తాను సినిమాు చేయనని పవన్ కల్యాణ్ చెప్పారు.

Tags:    

Similar News