బ్రేకింగ్ : జనసేన, బీజేపీ మీట్ 16న

జనసేన, బీజేపీ పార్టీల మధ్య ఈ నెల 16వ తేదీన కీలక సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను [more]

Update: 2020-01-14 11:59 GMT

జనసేన, బీజేపీ పార్టీల మధ్య ఈ నెల 16వ తేదీన కీలక సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవడం, ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలపై దాడులు జరగడం వంటివి వాటి పట్ల కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. అధికార వికేంద్రీకరణ జరిగితే నిజంగా స్వాగతించాల్సి విషయమేనని, కానీ వైసీపీ నేతలు చెప్పే వికేంద్రీకరణను తాము వ్యతిరేకిస్తామన్నారు. విశాఖపట్నం చుట్టూ వైసీపీ నేతలు భూములు కొనుగోలు చేశారన్నారు.

రిపీట్ అయిందో?

ఆంధ్రప్రదేశ్ లో కాకనాడ సంఘటన రిపీట్ అయితే సహించేది లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. కాకినాడలో పవన్ కల్యాణ్ వైసీీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలను పరామర్శించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాడిన భాష క్షమించారని దని తెలిపారు. పండగ సమయంలో లేనిపోని గొడవలు సృష్టించారన్నారు. వాళ్లే తిట్టి వాళ్లే దాడి చేసి మాపై కేసులు పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ సంఘటన ఆఖరిది అవ్వాలని అని అన్నారు. ఇది రిపీట్ అయితే ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వైసీపీ నేతల మదమెక్కిన మాటలే ఈ సంఘటనకు దారితీసిందన్నారు. 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే సుస్థిరంగా పాలన సాగించాల్సిన ప్రభుత్వం ఇలా అరాచకాలను సృష్టించడమేంటన్నారు. అందరూ ఈ సంఘటనను ఖండిచాలన్నారు. గవర్నర్ కు కూడా తాము ఫిర్యాదు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తీసుకెళ్లామన్నారు. తాను తెగించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అధికారం శాశ్వతం కాదన్నది వైసీపీ గుర్తుపెట్టుకో వాలన్నారు. జనసేన సహనాన్ని చేతకానితనంగా పరిగణించవద్దని కోరారు. మా కార్యకర్తల మీద పడిన దెబ్బను మర్చిపోలేక పోతున్నామన్నారు.

Tags:    

Similar News