బండి సంజయ్ టైగర్… పవన్ కితాబు

తుపాను తీవ్రత కంటే అధికారు నిర్లక్ష్యం కారణంగా రైతులు పంట ఎక్కువగా నష్టపోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ తెలిపారు. నెల్లూరు లో ఆయన మీడియాతో మాట్లాడారు. [more]

Update: 2020-12-05 04:53 GMT

తుపాను తీవ్రత కంటే అధికారు నిర్లక్ష్యం కారణంగా రైతులు పంట ఎక్కువగా నష్టపోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ తెలిపారు. నెల్లూరు లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను ఆదుకోలేని ప్రభుత్వం వృధా అని అన్నారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారాలు చూడాలని పవన్ కల్యాణ్ అన్నారు. అధికారుల నిర్వహణ లోపం కారణంగానే కడప పట్టణం మునిగిపోయిందని పవన్ కల్యాణ్ తెలిపారు. కనీసం అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలపై చర్చించేందుకు సమయాన్ని కూడా కేటాయించలేదన్నారు. ఏడో తేదీన రైతాంగానికి మద్దతుగా నిరసన దీక్షలు చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈలోగా ప్రభుత్వం నుంచి రైతాంగానికి నష్ట పరిహారం అందాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన 60 డివిజన్ లలో పోటీ చేద్దామని అనుకున్నామని, కానీ ఒక్క ఓటు కూడా బయటకు వెళ్లకూడదని బీజేపీకి మద్దతుగా జనసైనికులు నిలిచారన్నారు. వారికి తన ధన్యవాదాలు అని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను చూస్తే ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అర్ధమయిందన్నారు. బండి సంజయ్ ఒక టైగర్ లాగా తెలంగాణ బీజేపీకి నిలిచారన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు అన్ని ప్రాంతాల ప్రజలకు బలమైన సంకేతాలు పంపిందని పవన్ కల్యాణ్ తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికలలో ఎవరు పోటీ చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. సమన్వయ కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Tags:    

Similar News