ఫోన్ కాల్ తో ఐదు కోట్లు లూటీ చేశారే...!

Update: 2018-07-12 02:32 GMT

బ్యాంక్ కాల్ సెంటర్ నుండి కాల్ చేస్తున్నామని అంటారు. ఆన్ లైన్ షాపింగ్ లో మంచి గిప్ట్ గెలుచుకున్నారని నమ్మిస్తారు. వారి వలలో చిక్కిన వారి అకౌంట్లలో అమౌంట్ కొట్టేస్తారు. ఇది ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న నకిలీ కాల్ సెంటర్ ల దందా. ఈ ఆన్ లైన్ దందాలో 5కోట్లు కొట్టేసిన 8మందితో పాటు 22 మంది కాల్ సెంటర్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.

9 మంది ముఠాగా ఏర్పడి....

తొమ్మిది మంది సభ్యుల ముఠా పక్కా ఫోర్ ట్వంటీ బ్యాచ్. ఇందులో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు కాల్ సెంటర్ పేరుతో ఆన్ లైన్ దోపిడీలకు పాల్పడ్డారు. ఈ గ్యాంగ్ లో ఢిల్లీకి చెందిన విజయ్ కుమార్ శర్మ అనే మోసగాడు లా చదివాడు. తనకు ఉన్న అతి తెలివితో ఎస్.బి.ఐ. అకౌంట్లను లూటీ చేసేందుకు మరో 8 మందితో కలిసి ఫేక్ ఎస్.బి.ఐ కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో అభిజిత్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తికి చెందిన ఫ్యామిలీతో ఢిల్లీ కేంద్రంగా మూడు ఫేక్ కాల్ సెంటర్లను నెలకొల్పారు.

ప్రత్యేకంగా కాల్ సెంటర్లు....

అందుకోసం మూడు కాల్ సెంటర్లలో పనిచేసేందుకు 22 మందిని నియమించారు. వీళ్లందరికి ఒకటే టార్గెట్ తమ దగ్గరున్న ఎస్.బి.ఐ. అకౌంట్ల డేటాతో క్రెడిట్ కార్డుల నుండి ఆన్ లైన్ అమౌంట్ కాజేయడమే. అదీ 8వేల 500 రూపాయలు మాత్రమే. జయ శ్రీ డిస్టిబ్యూటర్స్ లో ఆన్ లైన్ షాపింగ్ ద్వారా గిప్ట్ గెలుచుకున్నారని నమ్మించి....వాళ్ళ ఓటిపి నెంబర్ తో మనీ ట్రాన్స్ ఫర్ చేయడమే. ఇలా ఒక్కో అకౌంట్ ను ట్రాప్ చేసిన టెలీ కాలర్ కి 10 వేల రూపాయల జీతంతో పాటు కాల్ ట్రాప్ కి 800 కమీషన్ ఇస్తున్నారు. ఇలా తమ మూడు ఫేక్ కాల్ సెంటర్లలో పనిచేస్తున్న టెలీ కాలర్లను కమీషన్ల ఆశ చూపి తమ టార్గెట్లు పూర్తి చేసుకున్నారు విజయ్ కుమార్ శర్మ,శ్రీవాత్సవ్.

మూడు అకౌంట్లు తెరచి.....

ఇలా ఆన్ లైన్ లో కాజేసిన క్యాష్ ట్రాన్స్ ఫర్ కోసం పక్కా ప్లాన్ చేసాడు విజయ్ కుమార్ శర్మ. అందుకోసం హైదరాబాద్ రామ్ గోపాల్ పేట్ లోని సందీప్ బజాజ్ అనే బట్టల వ్యాపారితో కలిసి జయ్ శ్రీ డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో మూడు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసారు. ఈ మూడు అకౌంట్లను www.jayyshree.com, www.jeansilke.com వెబ్ సైట్లకు లింక్ చేసారు. ఈ రెండు లింకులతో కాల్ సెంటర్ ఆపరేటర్ల నుండి ట్రాప్ అయిన డబ్బు నేరుగా సందీప్ బజాజ్ ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ అవుతోంది. ఇలా గత సంవత్సర కాలంగా జరుగుతున్న ఈ ఫేక్ కాల్ సెంటర్ ఆన్ లైన్ దోపిడిలో....8 మంది నిందితులు 5కోట్ల వరకు దోపిడీ చేశారు. ఇందులో టార్గెట్లు కమిషన్లతో వాటాలు పంచుకున్న ఈ గ్యాంగ్స్ బాగోతం.... ఎస్.బి.ఐ కార్డ్స్ అండ్ పే మెంట్స్ ఫిర్యాదుతో బయటపడింది. ఇలా క్రెడిట్ కార్డులతో ఆన్ లైన్ ఒక్కో అకౌంట్ నుండి కేవలం 8వేల 500 మాత్రమే ట్రాన్స్ ఫర్ చేసుకున్న ఈ ముఠాలు...కమీషన్ల ఆశచూపి నిరుద్యోగులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.... ఈ ముఠా నుండి 80 లక్షల నగదుతో పాటు ల్యాప్ టాప్ లు,ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు.ఇలా ఫేక్ కాల్ సెంటర్లతో అకౌంట్లు లూటీ చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఎవరికి ఫోన్ లైన్ లో ఓటిపి,సీ.వీ.వీ నెంబర్లు చెప్పొద్దని హెచ్చరిస్తున్నారు. సో బీ కేర్ ఫుల్.

Similar News