భారత్ లో ఇక్కడ లాక్ డౌన్ పెట్టకుంటే ఇక అంతే?

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వ్యాప్తి 15 శాతం ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాలని [more]

Update: 2021-04-29 00:47 GMT

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వ్యాప్తి 15 శాతం ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు దేశంలోని 150 జిల్లాలను కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. ఇక్కడ లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ ప్రాంతాల్లో కేవలం అత్యవసర సేవలను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది. ఇక్కడ లాక్ డౌన్ విధించకపోతే పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదముందని హెచ్చరించింది. రాష్ట్రాలను సంప్రదించిన తర్వాత లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకోనుంది.

Tags:    

Similar News