కొత్త సంప్రదాయానికి తెరలేపిన కాంగ్రెస్..!

Update: 2018-09-03 09:03 GMT

సోషల్ మీడియాలో వీక్ గా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బలు తిన్నది. ఈ విషయాన్ని లేటు గానైనా గుర్తింపు కాంగ్రెస్ అధిష్ఠానం తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇక నుండి సోషల్ మీడియాలో పార్టీతో పాటు నేతలు కూడా యాక్టీవ్ గా ఉండాలని భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తన ఐటీ విభాగాన్ని పటిష్ఠం చేసుకుంది. ఇక తాజాగా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులకు కొత్త రూల్స్ పెట్టింది. ఇంతవరకూ పోటీ చేయాలనుకునే వారి అంగ, అర్థ, సామాజిక బలాలను మాత్రమే పార్టీలు బేరీజు వేసుకునేవి. కానీ, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బలాన్ని సైతం పోటీకి అర్హతగా పెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపింది.

ఆ రాష్ట్ర టిక్కెట్ ఆశావాహులకు పీసీసీ పెట్టిన కొత్త రూల్స్ ఇవే...

- ఆశావాహులందరికీ కచ్చింగా ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలు ఉండాలి.

- అతడి ఫేస్ బుక్ పేజీకి కనీసం 15,000 లైకులు ఉండాలి.

- ట్విట్టర్ లో కనీసం 5000 మంది ఫాలోవర్లు ఉండాల్సిందే.

- స్థానికంగా పెద్దసంఖ్యలో వాట్సాప్ గ్రూపుల్లో అభ్యర్థి చేరి ఉండాలి.

- ఆశావహులంతా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పెట్టే పోస్టులను రిట్వీట్ చేయడంతో పాటు లైక్ చేయాల్సిందే.

- పార్టీ అధికారిక పేజీలో పెట్టే పోస్టులను తమ పేజీల్లో షేర్ చేసుకోవాలి.

- డిసెంబర్ లో జరుగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు అంతా ఈ నెల 15 తేదీ లోగా తమ సోషల్ మీడియా ఖాతాలను పార్టీకి అందజేయాలి.

ప్రస్తుతానికి మధ్య ప్రదేశ్ లో ఈ నియమాలు పెట్టినా, రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి, మన తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ టిక్కెట్ల ఆశావాహులు ఇప్పటినుంచే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా మారితే మేలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు

Similar News