దాడులను స్వయంగా పర్యవేక్షించిన మోడీ

పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దెబ్బకు పది దెబ్బలు కొట్టింది. సర్జికల్ స్ట్రైక్స్ 2 ద్వారా పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థలను కోలుకోలేని దెబ్బ [more]

Update: 2019-02-26 10:08 GMT

పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దెబ్బకు పది దెబ్బలు కొట్టింది. సర్జికల్ స్ట్రైక్స్ 2 ద్వారా పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థలను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. అమర జవాన్ల సాక్షిగా ప్రమాణం చేసినట్లుగానే ప్రధాని నరేంద్ర మోడీ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వైమానిక దాడులు చేయించారు. మంగళవారం తెల్లవారు జామున 12 మిరాజ్ – 2000 జెట్ ఫైటర్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యగా చేసుకొని దాడులు చేసి మట్టి కరిపించాయి. అయితే, ఈ దాడులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పర్యవేక్షించారని తెలుస్తోంది. కంట్రోల్ రూంలో ఉండి వైమానిక దాడులను ఆయన పర్యవేక్షించారు. దాడులు పూర్తి చేసుకోని మన దళాలు సురక్షితంగా తిరిగి వచ్చాక ఆయన బయటకు వచ్చారు. అనంతరం ఇవాళ ఉదయం ఆయన త్రివిధ దళాల అధికారులు, సీనియర్ మంత్రులతో మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.

Tags:    

Similar News