బిగ్ బ్రేకింగ్: ఓటమి దిశగా నారా లోకేష్

తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ బొక్కబోర్లా పడింది. ఆ పార్టీ కీలక నేత, మంత్రి నారా లోకేష్ సైతం ఓటమి దిశగా పయనిస్తున్నారు. [more]

Update: 2019-05-23 06:02 GMT

తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ బొక్కబోర్లా పడింది. ఆ పార్టీ కీలక నేత, మంత్రి నారా లోకేష్ సైతం ఓటమి దిశగా పయనిస్తున్నారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో మంగళగిరిలో నారా లోకేష్ పై వైఎస్సార్ కాంగ్స్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి 5,400 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. ఫలితాల సరళి ఇలానే కొనసాగితే ఆళ్ల రామకృష్ణారెడ్డి భారీ మెజారిటీతోనే విజయం సాధించే అవకాశం ఉంది. ఇక, మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, చినరాజప్ప, దేవినేని ఉమ, అయ్యన్నపాత్రుడు, కాల్వ శ్రీనివాసులు, సుజయ కృష్ణరంగారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, భూమా అఖిలప్రియ తదితరులు కూడా వెనుకంజలో ఉన్నారు.

Tags:    

Similar News