లోకేష్ పై టీజీ ఫైర్

Update: 2018-07-11 06:50 GMT

కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మంత్రి నారా లోకేష్ ప్రకటించడంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ స్పందించారు. నారా లోకేష్ పార్టీ అధ్యక్షుడు కాదని అటువంటప్పుడు ఆయన అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. అందునా అధికారిక కార్యక్రమంలో పార్టీ అభ్యర్థులను ప్రకటించడం సరికాదన్నారు. అభ్యర్థులను నారా లోకేష్ ప్రకటించడం తమను షాక్ కు గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. ఎస్వీ మోహన్ రెడ్డి నారా లోకేష్ ను హిప్నొటైజ్ చేశారేమో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ ను టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ ఆశిస్తున్న విషయం తెలిసిందే.

అప్పుడే ఒప్పందం జరిగింది...

అయితే, టీజీ వెంకటేష్ తో తనకు ఎటువంటి విభేదాలు లేవని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ అభ్యర్థులను ప్రకటించారని తెలిపారు.ఎన్నికలు జరిగే ముందే అభ్యర్థులను ప్రకటించాలనే నిబంధన ఏమీ లేదని, ముందే కూడా ప్రకటించవచ్చని ఆయన పేర్కొన్నారు. టీజీ వెంకటేష్ కి రాజ్యసభ అవకాశం ఇచ్చినప్పుడే ఎమ్మెల్యే టిక్కెట్ తనకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Similar News