వైఎస్ జగన్ పై నారా లోకేష్ ఫైర్

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. వరుస ట్వీట్లతో జగన్ పై విమర్శలు కురిపించారు. జగన్ చేస్తున్న ఆరోపణలను ఘాటుగా తిప్పికొట్టారు. [more]

Update: 2019-02-21 12:35 GMT

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. వరుస ట్వీట్లతో జగన్ పై విమర్శలు కురిపించారు. జగన్ చేస్తున్న ఆరోపణలను ఘాటుగా తిప్పికొట్టారు. 37 మందికి డీఎస్పీలుగా ప్రమోషన్లు వస్తే అందులో 35 మంది కమ్మ వారు ఉన్నారని జగన్ చేసిన ఆరోపణ సరికాదన్నారు. 2018 వరకు ప్రమోషన్ ప్యానెల్ లో ఉండి ప్రస్తుతం సూపర్ న్యూమరీ పోస్టుల్లో కొనసాగుతున్న 35 మందిలో 9 మంది బీసీలు, ఏడుగురు రెడ్లు, ఏడుగురు ఎస్సీలు, నలుగురు కాపు, బలిజలు, ఇద్దరు ముస్లింలు, ఇద్దరు మాత్రమే కమ్మలు, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ, ఎస్టీలు ఒక్కొక్కరు ఉన్నారని లోకేష్ స్పష్టం చేశారు.

జగన్ వెనుక కేసీఆర్, మోడీ

ఇక, కొండవీడులో రైతు కోటయ్య మృతిని రాజకీయం చేశారని, మనిషి ప్రాణానికి కూడా కులాన్ని జత చేయడం జగన్ కే చెల్లిందన్నారు. చింతమనేని ప్రసంగాన్ని కొంత వరకే ఎడిట్ చేసి జగన్ తన మీడియా ద్వారా దళితులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. జగన్ మీడియా చింతమనేని పూర్తి ప్రసంగాన్ని ఎందుకు చూపించదని ప్రశ్నించారు. పదే పదే కుల ప్రస్తావన తెస్తూ ఏపీలో కులాల మధ్య చిచ్చు పెట్టి అస్థిరపరచాలని చూస్తున్న జగన్ వెనుక రాష్ట్ర అభివృద్ధిని ఇష్టపడని కేసీఆర్, మోడీల పాత్ర స్పష్టమవుతోందని ఆయన ఆరోపించారు.

Tags:    

Similar News