బ్రేకింగ్ : మోత్కుపల్లి బహిష్కరణ

Update: 2018-05-28 13:05 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సంహులును పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన మోత్కుపల్లిని పార్టీ నుంచి బహిష్కరించామని పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు ఎల్.రమణ చంద్రబాబు నాయుడును కోరారు. దీంతో నర్సింహులుపై బహిష్కరణ వేటు పడింది. పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీకి నర్సింహులు నమ్మకస్తుడిగా పనిచేశారు. ఎన్టీఆర్ కు శిష్యుడిగా ఎదిగారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా కూడా పనిచేశారు. చంద్రబాబుతో సైతం సన్నిహితంగా ఉన్న నర్సింహులు ఇటీవలి కాలం లో ఆయనను విమర్శిస్తూ వస్తున్నారు.

మరోసారి హాట్ కామెంట్స్.....

ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణమని, మాలమాదిగల మధ్య చిచ్చుపెట్టాడని విమర్శించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని, జెండా దొంగతనం చేసిన దొంగగా చంద్రబాబును పోల్చారు. అయితే, నర్సింహులు టీఆర్ఎస్ లో చేరడం ఖాయంగానే కనపడుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఆయన కొందరు టీఆర్ఎస్ మంత్రులతో చర్చలు జరిపారు. అయితే మోత్కుపల్లి నర్సింహులు తన బహిష్కరణపై వేగంగా స్పందించారు. తనను బహిష్కరించే హక్కు వారికి లేదని, టీడీపీ నందమూరి కుటుంబ సభ్యులదని, టీడీపీని చంద్రబాబు దొంగిలించారని మరోసారి హాట్ కామెంట్స్ చేశారుమోత్కుపల్లి.

Similar News