పవన్ కు చింతమనేని ప్రతి సవాల్....దమ్ముంటే...?

Update: 2018-09-27 07:10 GMT

పార్లమెంట్ లో ఎంపీలు ఉంటారో ఎమ్మెల్యేలు ఉంటారో తెలుసుకోలేని స్థితిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎద్దేవా చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ దెందులూరులో చేసిన విమర్శలకు కౌంటర్ గా ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... 18 ఏళ్ల వయసున్న వ్యక్తిని తనపై పోటీ పెడతానని అంటున్నారని, అసలు 18 ఏళ్ల వయస్సు వారు పోటీకి అనర్హులనే కనీస అవగాహన కూడా ఆయనకు లేదన్నారు. తనపై మాట్లాడుతున్నట్లుగా పులివెందుల వెళ్లి జగన్ పై మాట్లాడగలడా అని ప్రశ్నించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదవడం పవన్ కళ్యాణ్ మానుకోవాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ తనపై పోటీ చేసి రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు. చావోరేవో దెందులూరులో తేల్చుకుందామని సవాల్ విసిరారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక నియోజకవర్గ కోఆర్డినేటర్ గా దీగజారాడన్నారు. తనను తిట్టిన ఆకు రైడీ, వీధి రౌడీ అనే పేర్లను రిజిస్టర్ చేయించుకుంటే తర్వాతి సినిమాలకు పనికొస్తాయన్నారు.

నాణేనికి ఇంకో పక్క చూస్తే తట్టుకోలేడు..!

పవన్ కళ్యాణ్ తన గురించి నాణేనికి ఒకపక్క చూశాడని, రెండో పక్క చూస్తే పవన్ కళ్యాణ్ తట్టుకోలేడని చింతమనేని ప్రభాకర్ అన్నారు. రౌడీయిజం, గూండాయిజం మీదే మాట్లాడిన పవన్ అభివృద్ధి విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. తనపై 37 కేసులున్నాయని, 27 కేసులున్నాయని ఎవరో రాసి ఇచ్చింది చదివారని, తనపై ఉన్నవి మూడు కేసులే అని స్పష్టం చేశారు. తాను విప్ ని అని, కానీ పవన్ కళ్యాణ్ చీఫ్ విప్ అని అంటున్నాడని, అంటే ఆయనకు ఈ రెండు పదవులకు తేడా కూడా తెలియదని విమర్శించారు. పవన్ తనపై మాట్లాడినట్లుగా వ్యక్తిగత విషయాలపై తాను మాట్లాడితే మూడు రోజులు నిద్ర కూడా పోలేడని హెచ్చరించారు. తాను క్రమశిక్షణ కలిగిన వ్యక్తినని, లేకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్థలం నుంచి బయటకు కూడా వెళ్లలేడన్నారు. పవన్ కు రాయకీయాల్లో కనీస అవగాహన తెచ్చుకోలేక పోతున్నారని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. కావాలంటే తనను ట్యూషన్ పెట్టుకోవాలని, పవన్ కు రాజకీయాలు నేర్పిస్తానన్నారు. తనపై ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

Similar News