మిరాజ్…. ట్రాక్ ‘‘రికార్డ్’’…!!

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని జైషే మహ్మద్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపిన తీరును దేశమంతా ప్రశంసిస్తోంది. పైలెట్ల సాహసానికి దేశం శాల్యూట్ చేస్తోంది. ఈ దాడుల్లో [more]

Update: 2019-02-26 06:37 GMT

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని జైషే మహ్మద్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపిన తీరును దేశమంతా ప్రశంసిస్తోంది. పైలెట్ల సాహసానికి దేశం శాల్యూట్ చేస్తోంది. ఈ దాడుల్లో భారత వైమానిక దళం మిరాజ్ 2000 విమానాన్ని ఉపయోగించింది. లేజర్ గైడెడ్ బాంబులతో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అరగంట లోపే మూడు ప్రాంతాల్లో ఉగ్రవాదులను తుత్తినియలను చేసింది. ఈ దాడుల్లో వినియోగించిన మిరాజ్ 2000 ఫ్లైట్ ల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

కార్గిల్ యుద్ధ సమయంలోనూ…..

మిరాజ్ 2000 విమానాల్లో సింగిల్ సీటు, టూసీటర్లు ఉన్నాయి. ఈ విమానం నుంచి దాదాపు తొమ్మిది చోట్లకు ఆయుధాలను తరలించే వీలుంది. ఈ విమానాలను ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ రూపొందించింది. కార్గిల్ యుద్ధ సమయంలోనూ మిరాజ్ అత్యున్నత సేవలను అందించాయి. క్షణాల్లో పని పూర్తి చేసుకుని వెంటనే తిరిగి మన స్థావరాలకు వచ్చే వీలుంటడంతో మిరాజ్ 2000 ను బాలా కోట్ దాడుల్లో భారత వైమానిక దళం వినియోగించింది. ఎంతటి లక్ష్యాన్ని అయినా సులువుగా ఛేదించగలుగుతాయి. చిమ్మచీకటిలోనూ గురితప్పవు. ఆటోమేటిక్ గా లక్ష్యాలను గుర్తిస్తాయి. అందుకే ఇప్పుడు భారత వైమానిక దళంతో పాటు మిరాజ్ కూడా దేశ ప్రజలనుంచి శభాష్ లను అందుకుంటోంది.

Tags:    

Similar News