ఆపరేషన్ సమాధాన్ తో స్టార్ట్ చేశారు….!!!

ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టులు ఆప‌రేష‌న్ స‌మాధాన్ వారోత్సవాలు ఘ‌నంగా ప్రారంబించారు. ఏవోబీ క‌టాఫ్ ఏరియాలో భారీ ఎత్తున స్థూపం నిర్మించి అమ‌రుల‌కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఇటీవ‌ల [more]

Update: 2019-01-28 03:46 GMT

ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టులు ఆప‌రేష‌న్ స‌మాధాన్ వారోత్సవాలు ఘ‌నంగా ప్రారంబించారు. ఏవోబీ క‌టాఫ్ ఏరియాలో భారీ ఎత్తున స్థూపం నిర్మించి అమ‌రుల‌కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఇటీవ‌ల ఎదురు కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు మొద‌టి మ‌హిళా నాయ‌కురాలు మీనా స్మార‌కంగా ఈ స్థూపాన్ని మావోయిస్టులు నిర్మించారు. నిర‌స‌న వారోత్సవాల స‌ంద‌ర్భంగా మావోయిస్టులు ప్రారంభించ‌ద‌ల‌చిన మీనా స్మార‌క‌స్థూపం ఆవిష్కర‌ణ‌కు ఏవోబీలో క‌టాఫ్ ఏరియాలోని ప‌లు గ్రామాల‌కు ఎదిన పెద్ద ఎత్తున గిరిజ‌నులు హాజ‌ర‌య్యారు.

విప్లవ గీతాలతో…..

ఈ సంద‌ర్భంగా మావోయిస్టు నేత‌లు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజ‌నుల‌కు చేస్తున్న అన్యాయాల‌పై వారికి వివ‌రించారు. ఆమాయ‌క గిరిజ‌నుల‌కు ఆస‌రా అయిన అట‌వీ సంప‌ద‌ను దోచుకుంటున్న వారిని అడ్డుకుందామని, ఖ‌నిజ సంప‌ద‌ను కాపాడుకుందామని విప్లవ‌గీతాలు ద్వారా గిరిజ‌నుల‌కు ప్రజామేళాలో తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా గిరిజ‌నులుతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

ప్రజాప్రతినిధులకు…..

మావోయిస్టు నిర‌స‌న వారోత్సవాలు సంద‌ర్భంగా బ‌స్సులు, ఇత‌ర వాహ‌నాల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఏవోబీలో క‌టాఫ్ ఏరియాలోలో వారం రోజులు పాటు పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్రక‌టించ‌డంతో అవ‌న్నీ తాళాలుతో ద‌ర్శన‌మిచ్చాయి. అలాగే వారాంతపు సంత‌ల్లో కూడా ప‌ల‌చ‌గా క‌నిపిస్తున్నారు. మావోయిస్టు నిర‌స‌న వారోత్సవాలు సంద‌ర్భంగా పోలీసులు అప్రమ‌త్తమయి బందోబ‌స్తు ఏర్పాట్లు చేశారు. ప్రజాప్రతినిధులు ఎవ‌రైనా బ‌య‌ట‌కు వెళ్లద్దొని పోలీసులు సూచిస్తున్నారు. గ‌ణ‌తంత్ర దినోత్సవాన్ని బ్లాక్‌డేగా పాటించాల‌ని మావోయిస్టులు హెచ్చరించ‌డంతో పోలీసులు గాలింపు చ‌ర్యల‌ను ముమ్మరం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణ‌ ప‌నుల‌ను నిలిపివేశారు .

Tags:    

Similar News