బిగ్ బ్రేకింగ్ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులు కూడా ఆర్కే మృతిని ధృవీకరించారు. బీజాపూర్ అడవుల్లో ఆర్కే మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేతగా [more]

Update: 2021-10-14 14:37 GMT

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులు కూడా ఆర్కే మృతిని ధృవీకరించారు. బీజాపూర్ అడవుల్లో ఆర్కే మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేతగా రామకృష్ణ అలియాస్ ఆర్కే దశాబ్దకాలంగా అడవుల్లోనే ఉన్నారు. ఆర్కే గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఎన్ కౌంటర్ జరిగినప్పుడల్లా ఆర్కే అందులో ఉన్నట్లు వార్తలు వచ్చేవి. కానీ ఆర్కే క్షేమమని మళ్లీ సమాచారం అందేది.

గత రెండేళ్లుగా…..

ఆర్కే గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బీజాపూర్ అడవుల్లోనే ఆయన ఉంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మావోయిస్టులు, ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఆర్కే పాల్గొన్నారు. అదే ఆయన జనారణ్యంలోకి రావడం ఆఖరుసారి. ఆర్కే పై యాభై లక్షల రివార్డు ఉంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై దాడికేసులో కూడా ఆర్కే నిందితుడిగా ఉన్నారు. బస్తర్ పోలీసులు కూడా ఆర్కే మృతిని ధృవీకరించారు.

Tags:    

Similar News