కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలి

రాష్ట్రంలో కోవిడ్-19 నియంత్రణకై రాష్ట్ర ప్రభుత్వం విధించిన రాత్రిపూట కర్ఫ్యూ ను పకడ్బందీగా అమలు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం.మహేందర్ రెడ్డి పోలీసు అధికారులను [more]

Update: 2021-04-21 01:09 GMT

రాష్ట్రంలో కోవిడ్-19 నియంత్రణకై రాష్ట్ర ప్రభుత్వం విధించిన రాత్రిపూట కర్ఫ్యూ ను పకడ్బందీగా అమలు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం.మహేందర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. రాత్రిపూట కర్ఫ్యూ అమలుపై రాష్ట్రంలోని పోలీస్ జోనల్ ఐ.జీ. లు, కమిషనర్లు, ఎస్.పీ లతో డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డి.జి.పి మాట్లాడుతూ… ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులో పేర్కొన్న నిబంధనల ప్రకారం కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేయాలని పేర్కొన్నారు. రాత్రి 9 గంటలనుండి ఉదయం 5గంటల వరకు విధించిన ఈ కర్ఫ్యూపై తమ పరిధిలోని వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులతో కర్ఫ్యూ నిబంధనలపై సమావేశం నిర్వహించి చైతన్య పర్చాలని తెలిపారు. కర్ఫ్యూ అమలులో పౌరులతో దురుసుగా ప్రవర్తించరాదని, నియమ నిబందనల పై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలన్నింటినీ రాత్రి 8 గంటల వరకు మూసివేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. నిబంధనలను అనుసరించి కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉన్నవారందరూ తమ గుర్తింపు కార్డులను చూపించాలని, ఏవిధమైన గూడ్స్ వాహనాలను ఆపకూడదని తెలియజేశారు. ఎయిర్ పోర్ట్ లు, రైల్వే స్టేషన్లకు వెళ్లేవారు, తిరిగి వచ్చేవారు తమ ప్రయాణ టికెట్లను తమ వద్దే ఉంచుకొని చూపించాల్సి ఉంటుందని, అంతరాష్ట్ర సర్వీసులు యదావిథిగా కొనసాగుతాయని డి.జి.పి స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు 90శాతంకు పైగా పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్ వేయించడంలో కృషిచేసిన పోలీసు అధికారులను డి.జి.పి అభినందించారు.

ఇక నుండి ఆన్ లైన్ ద్వారానే …?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ విభాగాలు చేపట్టే ఉద్యోగ నియమకాలకు గాను సర్టిఫికేట్ల వేరిఫికేషన్ ను ఆన్ లైన్ ద్వారా చేపట్టే విధానాన్ని నేడు డి.జి.పి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని పోలీస్ జోనల్ ఐ.జీ. లు, కమిషనర్లు, ఎస్.పీ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ ‘ఐ-వేరిఫై ’ విధానాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియమకాలతో పాటు విదేశాలకు వెళ్లే అభ్యర్థులు తమ సర్టిఫికేట్లు, ఉద్యోగ, వ్యాపార, ఇమ్మిగ్రేషన్ లకై పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్లకై దరఖాస్తు చేసుకునే విధానాన్ని ఆధునీకరించి ఆటోమెటెడ్ పోలీసు వేరిఫికేషన్ సర్టిఫికేషన్, పోలీసు క్లీయరెన్స్ సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సర్వీస్ లను పొందే వ్యక్తులు, సంస్థలు https://www.tspolice.gov.in వెబ్ సైట్ ద్వారా పోలీసు వేరిఫికేషన్, క్లీయరెన్స్ అనే లింక్ ను టిక్ చేయడం ద్వారా పూర్తి వివరాలు పొందవచ్చు.

Tags:    

Similar News