Narendra Modi : ఇదీ మోదీ ట్రాక్ రికార్డ్.. జూన్ 4న దేశం గెలవబోతుంది

జూన్ నాలుగోతేదీన దేశం గెలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎల్బీస్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు

Update: 2024-05-10 13:06 GMT

జూన్ నాలుగోతేదీన దేశం గెలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎల్బీస్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 140 కోట్ల మంది ప్రజల సంకల్పం గెలుస్తుందన్నారు. పదేళ్ల క్రితం హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు జరిగాయన్నారు. ఇప్పుడు జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో బలమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాంబు దాడులు ఆగాయని అన్నారు. 2012లో దిల్ సుఖ్ నగర్ లో పేలుళ్లు జరిగాయని, ఎందరో అమాయలకులు బలయ్యారని అన్నారు. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా ఒకే మాట వినిపిస్తుందని, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దు అన్న మాటలే వినపడుతున్నాయని అన్నారు.

ఉగ్రవాదుల చేతుల్లోకి...
దేశం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకూడదని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. యువరాజు రామనవమి చేసుకోవడం తప్పు అని అన్నారన్నారు. రాముడికి పూజ చేయడం దేశద్రోహమా? అని ఆయన ప్రశ్నించారు. తనకు హైదరాబాద్ చాలా ఇష్టమైన ప్రదేశమని మోదీ తెలిపారు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకించిన వారే ఇలా మాట్లాడతారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడికి వెళ్లాలన్నా భయం పుట్టేది అని అన్నారు. మోడీని తొలగించడానికి అనేక కుట్రలు చాలా మంది చేస్తున్నారన్నారు. మీ సంపదపై మీకు హక్కులు ఉండాలా? లేదా? అని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. భారత దేశం సిద్ధాంతం బుద్ధం శరణం గచ్ఛామి అని అన్నారు.
బలమైన ప్రజాస్వామ్య దేశంగా...
భారతదేశ సిద్ధాంతం బలమైన ప్రజాస్వామ్యమని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ మొత్తం బీజేపీకే ఓటు వేస్తామని అంటుందని అన్నారు. వారసత్వ రాజకీయాలు, లూటీ కాంగ్రెస్ ట్రాక్ రికార్డు అని, చెప్పిన వాగ్దానాలను అమలు చేయడం మోదీ ట్రాక్ రికార్డు అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తగ్గించి మైనారిటీలకు ఇచ్చారన్నారు. తెలంగాణలో డబుల్ ఆర్ సర్కార్ నడుస్తుందన్నారు. ఒక ఆర్ హైదరాబాద్ లోనూ, మరొక ఆర్ ఢిల్లీలోనూ ఉన్నారన్నారు. ిఇక్కడ మరో ఆర్ ట్యాక్స్ కూడా ఉందని, రజాకార్ ట్యాక్స్ అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ ను గెలిపించడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు.


Tags:    

Similar News