అన్నకు ఛాన్సిచ్చారు...!

Update: 2018-05-15 13:31 GMT

కర్ణాటక ఎన్నికల్లో అందరి దృష్టి సొరబ నియోజకవర్గంపైనే ఉంది. మాజీ ముఖ్యమంత్రి సారెకొప్ప బంగారప్ప సొంత నియోజకవర్గమైన సొరబలో విజయం ఎవరిది అనేది ఉత్కంఠ కలిగించింది. ఈ నియోజకవర్గం గతంలో బంగారప్ప కుటుంబానికి కంచుకోటగా ఉండేది. ఈ నియోజకవర్గం నుంచి బంగారప్ప ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆయన తర్వాత కూడా పెద్ద కుమారుడు కుమార బంగారప్ప మూడు సార్లు విజయం సాధించాడు. కానీ, బంగారప్ప కుమారుల మధ్య విభేదాలతో 2004 నుంచి మరో కుమారుడు మధు బంగారప్ప కూడా అన్నపైనే పోటీ చేస్తున్నాడు. ఇద్దరూ చెరోసారి విజయం సాదించారు. కాగా, ఈ ఎన్నికల్లోనూ అన్నదమ్ముల సవాల్ మరోసారి నెలకొంది. గత ఎన్నికల్లో తమ్ముడు మధు బంగారప్ప విజయం సాధించగా, ఈ ఎన్నికల్లో ప్రజలు అన్నకు ఛాన్ ఇచ్చారు. బీజేపీ తరుపున పోటీ చేసిన కుమార బంగారప్ప తన తమ్ముడు మధు బంగారప్పపై సుమారు 9 వేల ఓట్లతో విజయం సాధించారు.

Similar News