బిగ్ బ్రేకింగ్ : సుజనా చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

Update: 2018-11-24 06:11 GMT

టీడీపీ ముఖ్యనేత, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి చుట్టు ఉచ్చు బిగిస్తోంది. నిన్న అర్థరాత్రి నుంచి సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాల్లో చెన్నై నుంచి వచ్చిన ఈడీ బృందాలు సోదాలు చేస్తోంది. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం, నాగార్జున హిల్స్ లోని కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. బ్యాంకులకు రుణాల ఎగవేతకు సంబంధించి నమోదైన కేసులో సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మాజీ సీబీఐ డైరెక్టర్ విజయరామారావు కుమారుడు శ్రీనివాస కళ్యాణ్ రావు గతంలో సుజనా గ్రూప్ కి చెందిన బెస్ట్ ఆండ్ క్రాంప్టన్ డైరెక్టర్ గా పని చేశారు.

లుకౌట్ నోటీసులు జారీ....

ఆ సమయంలో మూడు బ్యాంకుల నుంచి తీసుకున్న 304 కోట్ల రుణాలు ఎగబెట్టారని కేసు నమోదైంది. దీంతో పాటు సుజనా గ్రూప్ లో 120 కంపెనీలు ఉన్నాయని, వాటిలో షెల్ కంపెనీలు కూడా ఉన్నట్లు సీబీఐ, ఈడీ గుర్తించింది. అయితే, సుజనా గ్రూప్ లో అంతిమంగా లబ్ధిపొందిన వ్యక్తి సుజనా చౌదరినే ఈడీ, సీబీఐ గుర్తించి ఆయన విదేశాలకు పారిపోకుడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయనకు చెందిన పలు విదేశీ కార్లు, డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు.

Similar News