బ్రేకింగ్ : తెలంగాణలో లగడపాటి లాస్ట్ సర్వే ఇదే

Update: 2018-12-07 13:43 GMT

తెలంగాణ రాష్ట్ర ఎన్నికలపై లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలు వెల్లడించారు. అనేక దఫాలుగా సర్వే ఫలితాలను వెల్లడించిన మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఫైనల్ గా తన ఫలితాలను వెల్లడించారు. 68.5 శాతం గత ఎన్నికల్లో పోల్ కాగా ఈ ఎన్నికల్లో దానికన్నా అధికశాతం పోలింగ్ అయిందని ఆయన చెప్పారు. ఇండిపెండెంట్లు ఈసారి ఎనమిది నుంచి పది స్థానాలు గెలుస్తారని గతంలో చెప్పానన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో పట్టుదల పెరిగి పోలింగ్ శాతం పెరిగిందన్నారు. తెలంగాణలో ఇతర రాష్ట్రాల మాదిరిగా ధన ప్రవాహం ఈ ఎన్నికల్లో కన్పించిందన్నారు. నేతలు ఇచ్చిన హామీలు కూడా ప్రభావం చూపాయన్నారు.

కాంగ్రెస్ కు 65 స్థానాలు.....

ఈ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులు ఏడుగురు గెలుస్తారని చెప్పారు. బీజేపీకూడా ఏడు స్థానాలు, తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన 13 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుస్తారని, దీంతో టీడీపీ ఏడు స్థానాలను గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి 65, టీఆర్ఎస్ 35 స్థానాలు వస్తాయన్నారు. కసి, ప్రేమ, నమ్మకం వంటివి ఈ ఎన్నికల్లో పనిచేస్తాయన్నారు. సెప్టెంబరు నుంచి పలుమార్లు సర్వే చేశానని ఆయన తెలిపారు. ఎంఐఎం కు 7 స్థానాలు, బీఎల్ఎఫ్ కు ఒక స్థానం వచ్చే అవకాశం ఉందన్నారు.

Similar News