కర్ణాటక సీఎం కుమారస్వామికి వింత భయం

Update: 2018-07-30 11:53 GMT

కర్ణాటకలో గౌడ కుటుంబానికి ఉండే నమ్మకాలు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. మాజీ ప్రధాని దేవెగౌడ దగ్గర నుంచి ఆ కుటుంబంలోని ప్రతీ ఒక్కిరికీ మూడనమ్మకాలు ఉంటాయి. మొన్నటికి మొన్న దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ ఓ జ్యోతిష్యుడి సలహా మేరకు బెంగళూరులో ఉండకుండా రోజూ మూడు వంద కిలోమీటర్లు ప్రయాణిస్తున్న వార్త చర్చనీయాంశమైంది. ఇక తాజాగా చంద్ర గ్రహణం రోజు కూడా ఆ కుటుంబం మొత్తం గ్రహణ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు శాంతి పూజలు చేశారు. ఇక తాజాగా ఏకంగా ముఖ్యమంత్రి కుమారస్వామి మూఢనమ్మకం వల్ల పాలన స్తంభించిపోయింది.

దేనికైనా ఆషాడం వెళ్లాల్సిందే...

కర్ణాటకలో ఇటీవల వర్షాలు బాగా కురిసాయి. దీంతో పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. అయితే, వరద సహాయక చర్యలు, బాధితులకు అందించాల్సిన సహాయంపై చర్చించేందుకు క్యాబినెట్ సమావేశం ఏర్పాటుచేయాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత పరమేశ్వరన్ కుమారస్వామిని కోరారు. దీంతో పాటు మరికొన్ని ముఖ్య ముఖ్యమైన అంశాలపైనా ప్రభుత్వం నిర్ణయించాల్సి ది. అయితే, ఆయన తండ్రి దేవెగౌడ మాత్రం క్యాబినెట్ సమావేశం నిర్వహించవద్దని చెప్పారట. ఆషాడ మాసంలో క్యాబినెట్ సమావేశం పెట్టడం మంచిది కాదని, ఆషాడం అయిపోయాక పెట్టాలని సూచించారట. దీంతో కుమారస్వామి క్యాబినెట్ భేటీ నిర్వహించడం లేదు. ఆగస్టు 12న ఆషాడ మాసం వెళ్లే వరకు మీటింగ్ పెట్టేది లేదని తేల్చారట. దీంతో కాంగ్రెస్ నేతలు, అధికారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని తెలుస్తోంది. అయితే, వ్యక్తిగత నమ్మకాలను ప్రభుత్వానికి అంటించడం సరికాదని మిత్రపక్షం కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

Similar News