కిడారి చివరి మాటలివే....!

Update: 2018-09-24 03:44 GMT

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ భౌతిక కాయాలకు పోస్టుమార్టం పూర్తయింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సర్వేశ్వరరావు అంత్యక్రియలు పాడేరులోనూ, సోమ అంత్యక్రియలు అరకులోనూ ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఎమ్మెల్యేలు బయలుదేరి వెళ్లారు. అరకు వ్యాలీ మొత్తం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విశాఖ నుంచి అరకుకకు 12 స్పెషల్ పార్టీ బృందాలు బయలుదేరి వెళ్లాయి.

ప్రత్యేక హెలికాస్టర్లు.......

మంత్రులు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లను సిద్ధం చేసింది. కాగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మృతికి నిరసనగా విశాఖ మన్యంలో రెండు రోజుల బంద్ కు గిరిజనులు పిలుపునిచ్చారు. దీంతో మన్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏజెన్సీలో 8 గేహౌండ్స్ దళాలతో కూబింగ్ జరుగుతోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కిడారి సర్వేశ్వరరావు మావోలు చుట్టుముట్టిన వెంటనే "చనిపోయాం రా" అని అన్నారు. అదే ఆయన చివరి మాటలని ప్రత్యక్ష సాక్షులు గుర్తు చేసుకుంటూ రోదిస్తున్నారు.

Similar News