ఖైరతాబాద్ గణేష్ పై కరోనా ఎఫెక్ట్

ఖైరతాబాద్ గణేష్ ఏర్పాటు పై తర్జన భర్జన కొనసాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్ ఎత్తు పై ఇప్పుడు కమిటీ మల్లగుల్లాలు పడుతోంది. ఇందుకు సంబంధించి ఎటు [more]

Update: 2020-05-12 12:50 GMT

ఖైరతాబాద్ గణేష్ ఏర్పాటు పై తర్జన భర్జన కొనసాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్ ఎత్తు పై ఇప్పుడు కమిటీ మల్లగుల్లాలు పడుతోంది. ఇందుకు సంబంధించి ఎటు తేల్చుకోలేక పోతుంది. అయితే ఈ నెల 18వ తేదీన ఖైరతాబాద్ గణేష్ కు సంబంధించిన కర్ర పూజ చేస్తున్నట్టుగా కమిటీ అధికారికంగా ప్రకటించింది. అయితే దీనిపై అటు సోషల్ మీడియాలో పూర్తిగా వాద ప్రతివాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ కర్ర పూజ ను రద్దు చేస్తున్నట్లుగా కమిటీ ప్రకటించింది. అయితే 18వ తేదీన ఖైరతాబాద్ గణేష్ ఏర్పాటు పైన కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అధికారికంగా ప్రకటించింది. అయితే ఆగస్టు లోగా కరోనా కట్టడి కాకపోతే ఖైరతాబాద్ గణేశుడు ఎత్తు తగ్గించే అవకాశం కనబడుతోంది.

ఎత్తుపైనా చర్చలు….

ఇందుకు సంబంధించి కమిటీ అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ కరోనా కట్టడి కాకపోతే తప్పనిసరిగా ఖైరతాబాద్ గణేశుడు ఎత్తు తగ్గే అవకాశముంది. మరొకవైపు చూసినట్లయితే మరొక ఆరు నెలల పాటు సోషల్ గ్యాదరింగ్ ను రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించే ప్రసక్తే లేదు .ఈ నేపథ్యంలో గణేష్ ని ఏర్పాటు చేసినట్లయితే ఎత్తున సోషల్ గ్యాదరింగ్ ఉంటుంది . కాబట్టి పోలీసులు కూడా దీనికి తప్పనిసరిగా అనుమతి ఇవ్వకపోవచ్చు. అని కొంత సమాచారం ఉంది. ఇప్పటికే కమిటీ సభ్యులు పోలీసులను సంప్రదించారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సోషల్ గ్యాదరింగ్ పై ఒక స్పష్టమైన ఆదేశం వచ్చిన తర్వాతనే తాము ఏదైనా తేలుస్తామని అటు పోలీస్ అధికారి చెప్పారు. కాబట్టి ఖైరతాబాద్ గణేష్ ని ఏర్పాటు పైన ఇప్పటికీ చర్చలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.

Tags:    

Similar News