దృశ్యం సినిమా చూసి…?

మీరు దృశ్యం సినిమా చూశారా..? ఓ హత్య చేసి.. నిజాన్ని దాచిపెట్టి సినీ ప్రేక్షకుల మొత్తాన్ని టెన్షన్ పెట్టించింది.. ఆ సినిమా.. సేమ్ అదే తరహాలో సీన్ [more]

Update: 2019-10-31 14:33 GMT

మీరు దృశ్యం సినిమా చూశారా..? ఓ హత్య చేసి.. నిజాన్ని దాచిపెట్టి సినీ ప్రేక్షకుల మొత్తాన్ని టెన్షన్ పెట్టించింది.. ఆ సినిమా.. సేమ్ అదే తరహాలో సీన్ క్రియేట్ చేయాలనుకున్నారు.. అనుకున్న ప్లాన్ ప్రకారం స్క్రీన్ ప్లే రాసుకున్నారు.. కన్నతల్లిని చంపేసి నిజాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నంచారు.. కానీ అది సినిమా కావడంతో అక్కడ నిజం పోలీసులకు తెలియకుండానే సమాధిగానే మిగిలిపోయింది. ఇక్కడ రియల్ మర్డర్ కావడంతో పోలీసులు నిప్పులాంటి నిజాన్ని బయటపెట్టారు. ఇంతకీ పోలీసులు బయటపెట్టిన ఆ నిజాలు ఏంటి? కన్న కూతురే కన్న తల్లిని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?

ప్రియుడి సహకారంతోనే…

గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ పెట్టిస్తున్న కీర్తి రెడ్డి కేసుని పోలీసులు ఛేదించారు.. కేవలం డబ్బు కోసమే కన్న తల్లిని హత్య చేసిందని పోలీసులు నిర్ధారించారు.. ప్రియుడు సహకారంతోనే ఈ హత్య చేసినట్లు స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాసరెడ్డి, రజిత దంపతులు హయత్ నగర్ వచ్చి స్థిరపడ్డారు. శ్రీనివాసరెడ్డి సొంత లారీని తిప్పుతుంటాడు. భార్య రజిత చిట్టీల వ్యాపారం చేస్తుంది వీరికి ఒక్కగానొక్క కుమార్తె కీర్తిరెడ్డి. చిన్న నాటి నుంచి కీర్తిరెడ్డిని ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం కీర్తిరెడ్డి దిల్ షుక్ నగర్ లో ఓ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది.

బాల్ రెడ్డితో పరిచయం….

కీర్తి ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో శిల్పారెడ్డి అనే యువతి ద్వారా బాల్ రెడ్డికి పరిచయమైంది. తద్వారా బాల్ రెడ్డితో ప్రేమాయాణం నడిపిన కీర్తి అతనితో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమాయాణం కాస్తా లైంగిక సంబంధంగా మారడంతో కీర్తి 2018 సెప్టెంబర్ లో గర్భందాల్చింది.. గర్భం దాల్చిన విషయం ఇంట్లో తెలిస్తే కోప్పడతారు అనే భయంతో అబార్షన్ చేయించేందుకు ఇంటి పక్కనుండే శశికుమార్ అనే యువకుడి సహాయం కోరింది.

అబార్షన్ చేయించుకుని….

శశికుమార్ కీర్తిని మహబూబ్ నగర్ జిల్లా అమనగల్లు తీసుకువెళ్లి అబార్షన్ చేయించాడు. కీర్తి అబార్షన్ తర్వాత ఇదే అదనుగా భావించిన శశికుమార్ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. అబార్షన్ చేయించుకున్న వ్యవహారాన్ని ఇంట్లో చెప్పకుండా ఉండేందుకు పది లక్షలు ఇవ్వాలని కీర్తిని డిమాండ్ చేశాడు శివకుమార్. తన దగ్గర అంత డబ్బులేదని కీర్తి చెప్పింది. శశికుమార్ వేధింపులు భరించలేకపోయిన కీర్తి తన తల్లి చిట్టీల వ్యాపారం చేస్తుందని, ఆమెను చంపితే పది లక్షలు వస్తాయంటూ శశికుమార్ కు సలహా ఇచ్చింది. కీర్తి చెప్పిన ఇన్ఫర్మేషన్ తో రజితను చంపేందుకు శశికుమార్ పక్కా ప్లాన్ వేశాడు. ఈనెల 19వ తేదీన రాత్రి సమయంలో రజితను శశికుమార్, కీర్తి కలిసి దారుణంగా హత్య చేశారు.

పది లక్షల కోసం…..

హత్య అనంతరం శశికుమార్, రజిత శవాన్ని 3 రోజుల పాటు ఇంట్లోనే ఉంచారు. ఈలోపు ఆమె బాల్ రెడ్డి ఇంటికి రెండు రోజులు కీర్తి రెడ్డి వెళ్లి వచ్చింది. మూడో రోజు శవం నుంచి దుర్వాసన రావటంతో శశి, కీర్తి, శవాన్ని బెడ్ షీట్ లో చుట్టుకుని, కారులో రామన్నపేట రైల్వేట్రాక్ వద్దకు తీసుకువెళ్లి పారేసి వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమీ తెలియనట్లు తన తల్లి కనపడటంలేదని కీర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీనివాసరెడ్డి డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఏదంటూ కూతుర్ని నిలదీయడంతో నిజాన్ని బయటపెట్టింది. దీంతో కేసు విచారణ చేపట్టిన పోలీసులు తమదైన స్టయిల్లో విచారణ చేయడంతో కీర్తి రోజుకో నిజం పోలీసులకు చెప్పింది. కీర్తితో పాటు శశికుమార్ కూడా హత్యలో పాలుపంచుకోవడంతో ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

సాక్ష్యాలు లేకుండా చేయాలని…..

అంతేకాకుండా కీర్తిపై అత్యాచారానికి పాల్పడిన బాల్ రెడ్డిపైనా కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా హత్యా నేరం తమపైకి రాకుండా ఉండేందుకు కీర్తి, శశిలు చాలా ప్రయత్నాలు చేశారని, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో చాలా ఆధారాలున్నాయని అన్నారు. మొత్తం ఎపిసోడ్ లో ఇద్దరు నిందితులు దృశ్యం-2 సినిమాను పోలీసులకు చూపించారన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. కూతురుని అల్లారు ముద్దుగా పెంచినందుకు తల్లి దిక్కు లేని చావు చనిపోయింది. కనీసం శవం కూడా సరైన దహన సంస్కారానికి నోచు కోలేదు. ఇక తండ్రి బతికిఉన్న శవమే. ఆ క్రిమినల్ కూతురికి కనీసం పదేళ్లు జైలు జీవితం. అంటే మొత్తం ఒక కుటుంబం నాశనం.

Tags:    

Similar News