కేసీఆర్ ‘తెలంగాణ గాంధీ’

Update: 2018-08-03 08:39 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ‘తెలంగాణ గాంధీ’ అంటున్నారు ఆ పార్టీ ఎమ్మల్సీ రాములు నాయక్. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి మహాత్మ గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కేసీఆర్ నెరవేర్చారని ఆయన పేర్కొన్నారు. రాములు నాయక్ మీడియాతో మాట్లాడుతూ... ఆగస్టు 2న గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గిరిజనులకు అసలైన స్వతంత్ర్యం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు గిరిజనులమే మా పంచాయితీలను పాలించవచ్చన్నారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని, దశాబ్దాల కలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. గిరిజనులు ఇప్పుడు కేసీఆర్ ను ‘తెలంగాణ గాంధీ’గా భావిస్తున్నారని పేర్కొన్నారు. దేశానికి స్వతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా, తెలంగాణ గిరిజనులకు మాత్రం అసలైన స్వతంత్ర్యం ఆగస్టు 2న వచ్చిందన్నారు. ఇన్నేళ్లుగా పాలించిన ప్రభుత్వాలు, పార్టీలు గిరిజనులను కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే చూశాయని విమర్శించారు.

Similar News